విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి
ABN, First Publish Date - 2023-06-26T23:31:30+05:30
విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని కలసపాడు విద్యుత్‌శాఖ అధికారి బ్రహ్మానందరెడ్డికి సోమవారం కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.
కలసపాడు, జూన్ 26: విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని కలసపాడు విద్యుత్‌శాఖ అధికారి బ్రహ్మానందరెడ్డికి సోమవారం కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 లోనే రూ.14వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీలను వసూలు చేశారన్నారు. దేశంలో 18 ల క్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు స్మార్ట్‌మీటర్లు బిగిస్తూ విద్యుత్ చార్జీల రూపంలో దోచుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించకుంటే ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ మండల అధ్యక్షుడు హుస్సేన్‌పీరా, కేవీపీఎస్ మండల కార్యదర్శి సుదర్శన్, ఆవాజ్ మండల కార్యదర్శి చిన్న నాగూరువల్లిపాల్గొన్నారు.
పోరుమామిళ్ల..: ట్రూ అప్ సర్దుబాటు చార్జీలు వసూలు నిలిపివేయాలని సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్‌చార్జీలు తగ్గించాలని ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్లకు జగన్ ప్రభుత్వం జేబులు నింపుతూ విద్యుత్‌చార్జీలతో ప్రజలసై భారం మోపుతోందన్నారు.రానున్న రోజుల్లో స్మార్ట్‌మీటర్లు పెట్టి భారం పెం చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం ఏడీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ అధ్యక్షురాలు గౌసియాబేగం, వరలక్షుమ్మ, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
బద్వేలు..: విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అన్వేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ను పేదలకు దూరం చేస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను, కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్, చాంద్‌బాష, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
జమ్మలమడుగు..: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక రకాలుగా ధరలు పెంచి భారాన్ని మోపుతున్నారని, ప్రజలు తిరుగుబాటు చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శివనారాయణ, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, ఆర్‌ఎ్‌సవో నాయకులు లింగమయ్య, బుడగజంగం జిల్లా అధ్యక్షులు నల్లప్ప, మాలమహానాడు రాయలసీమ కార్యదర్శి పొన్నతోట జయచంద్ర, చేనేత ఐక్యవేదిక దక్షిణభారత కన్వీనర్ కొండప్ప, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:31:45+05:30 IST