ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులివెందులలో జిల్లా సైన్స్‌ఫెయిర్‌

ABN, First Publish Date - 2023-02-06T23:39:43+05:30

పులివెందుల అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14 తేదీల్లో జిల్లా సైన్స్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారి చెప్ప లి దేవరాజ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 6 : పులివెందుల అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 13, 14 తేదీల్లో జిల్లా సైన్స్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారి చెప్ప లి దేవరాజ్‌ పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో సోమవారం జిల్లా సైన్స్‌ అధికారి మహేశ్వర్‌రెడ్డి డీఈవోను కలిసి సైన్స్‌ఫెయిర్‌ నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెరెక్టర్‌ ఆఫ్‌ ఎస్‌ఈఆర్‌టీ ఆదేశాల మేరకు పాఠశాల, మండల స్థాయిల్లో సైన్స్‌ఫెయిర్‌ను ఎకోఫ్రెండ్లీ మెటీరియల్‌, ఆరోగ్యం, పరిశుభ్రత, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ యాప్స్‌, వాతావరణ మార్పులు తదితర ఐదు అంశాలపై నిర్వహిస్తామన్నారు. మండల స్థాయిలో పై ఐదు అంశాల్లో మొదటిస్థానం సాధించిన 180 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సైన్స్‌ఫెయిర్‌లో ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టును మరింతగా మెరుగుపరచుకుని... రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా జిల్లా స్థాయికి తీసుకురావాలని సూచించారు. మండలస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. విద్యార్థులు ఏ అంశంలో అయి తే ఎంపికై ఉంటారో అదే అంశంలో ప్రాతినిధ్యం వహించాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు ఒక విద్యార్థి మాత్రమే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు రావాలని... వారికి తోడుగా గైడ్‌ ఉపాధ్యాయుడు ఉంటారని వివరించారు.

Updated Date - 2023-02-06T23:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising