గడ్డి కత్తిరింపు యంత్రాలు పంపిణీ
ABN, First Publish Date - 2023-08-15T23:59:09+05:30
తంబళ్లపల్లె పశు వైద్యశాలలో పాడి రైతులకు ప్రభుత్వ రాయి తీపై గడ్డి కత్తిరించే యంత్రాలను పంపిణీ చేశారు.
తంబళ్లపల్లె, ఆగస్టు 15: తంబళ్లపల్లె పశు వైద్యశాలలో పాడి రైతులకు ప్రభుత్వ రాయి తీపై గడ్డి కత్తిరించే యంత్రాలను పంపిణీ చేశారు. మంగళవారం ఏడీ సుమిత్ర ఆధ్వ ర్యంలో తంబళ్లపల్లె మండలానికి చెందిన 20 మందికి, పెద్దమండ్యం మండలంకు చెం దిన 14 మంది పాడి రైతులకు ఈ యంత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ..యంత్రాలతో గడ్డిని కత్తిరించి పశువులకు ఇవ్వడం ద్వారా అన్ని రకాల పోషకాలు లభించడంతో పాటు గడ్డి వృఽథా కాకుండా ఉంటుందన్నారు. ఒక్కో యూని ట్ (యంత్రం) విలువ రూ.33,970లు ఉంటుందని, ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.13,588లు పోనూ, రైతులు రూ.20,382లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్ర మంలో రెండో వైస్ ఎంపీపీ కరీం, కో ఆప్షన సభ్యుడు జమాల్ బాషా, వైసీపీ నాయ కుడు రామ్మూర్తి, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-15T23:59:09+05:30 IST