వసూల్ రాజాపై క్రిమినల్ కేసు
ABN, First Publish Date - 2023-02-28T23:37:44+05:30
Criminal case against Vasool Raja
బాధితుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులకు నివేదిక
గాలివీడు, ఫిబ్రవరి 28: భూపట్టాలు ఇప్పిస్తానని పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వీఆర్‌ఏ కుమారుడి (వసూల్‌రాజా)పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తహసీల్దార్ దైవాదీనం తెలిపారు. మండలంలోని గోరాన్‌చెరువు, గాలివీడు గ్రామాల పరిధిలో భూపట్టాలు ఇప్పిస్తానని నమ్మబలికి అక్ర మ వసూళ్లకు పాల్పడిన బినామీ వీఆర్‌ఏపై మంగళవారం తహసీల్దార్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం స్పందన కార్యక్రమంలో బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయ గా కలెక్టర్ వెంటనే గాలివీడు రెవెన్యూ సిబ్బందిని కలెక్టరేట్‌కు పిలిపించి మందలించడంతో పాటు రెండు రోజుల్లో బాధితుల సొమ్మును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
Updated Date - 2023-02-28T23:38:01+05:30 IST