ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన తెలుపుతున్న పేద రైతులు

ABN, First Publish Date - 2023-03-02T23:13:28+05:30

మదనపల్లె-తిరుపతి జాతీయ రహ దారి కోసం అనుమతుల్లేకుండా పేదల భూముల్లోని మట్టిని అక్ర మంగా తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు గురువారం నిరసన చేపట్టారు.

రైతుల నిరసన.. సీపీఎం నేతల మద్దతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రైతుల నిరసన.. సీపీఎం నేతల మద్దతు

మదనపల్లె అర్బన, మార్చి2: మదనపల్లె-తిరుపతి జాతీయ రహ దారి కోసం అనుమతుల్లేకుండా పేదల భూముల్లోని మట్టిని అక్ర మంగా తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు గురువారం నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీని వాసులు మాట్లాడుతూ మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారి పక్కన ఉన్న బసినికొండ గ్రామ రెవెన్యూ సర్వే 1130, 987 నెం బర్లులో ఉన్న పేదల భూములను అక్రమించుకుని జాతీయ రహ దారికి మట్టిని వాడుకోవడమే కాకుండా, ప్రైవేట్‌ వ్యక్తులకు టిప్పర్‌ లోడు రూ. 4 వేలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. 987 సర్వే నెంబరులో అనుమతులు తీసుకున్న హైవే కాంట్రాక్టర్‌ 1130 సర్వే నెంబరుల్లో పేదల పేరుతో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూ ముల్లో అక్రమ మట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అఽధికారులు నోరు మెదపడం లేదన్నారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులుచ వంకలు వాగులు, శ్మశానాలు కబ్జాకు గురవుతున్న రెవెన్యూ ఇరిగేష న అధికారులకు ఏమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. పేదల భూములలో మట్టి జోలికి ఎవరూ రాకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!