ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొటోకాల్‌ పాటించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-05-31T23:07:27+05:30

సంబేపల్లె జడ్పీటీసీగా ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధిగా ప్రాతినిథ్యం వహిస్తున్న తనను ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానానికి గురి చేశారని మనస్థాపం చెందుతూ సంబేపల్లె జడ్పీటీసీ గొర్ల కవిత బుధవారం కలెక్టర్‌ గిరీషాకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, మే31: సంబేపల్లె జడ్పీటీసీగా ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధిగా ప్రాతినిథ్యం వహిస్తున్న తనను ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానానికి గురి చేశారని మనస్థాపం చెందుతూ సంబేపల్లె జడ్పీటీసీ గొర్ల కవిత బుధవారం కలెక్టర్‌ గిరీషాకు ఫిర్యాదు చేశారు. మే 22న గుట్టపల్లె పంచాయతీ అంకిరెడ్డిగారిపల్లెలో ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో భాగంగా ప్రారంభించిన సచివాలయ సముదాయ భవన ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ నిబంధనలు ఉల్లంఘించారని కలెక్టర్‌కు వివరించారు. సామాన్య కార్యకర్తలకు, వలంటీర్లకు ఇచ్చిన గౌరవం కూడా మహిళా జడ్పీటీసీగా తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలను ఉల్లంఘించి ఏర్పాటు వాటిని తొలగించి అదే స్థానంలో నిబంధనల ప్రకారం జడ్పీటీసీ పేరు చేర్చి శిలాఫలకాలను ఏర్పాటు చేయాల ని కోరారు. ప్రొటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ఈ విషయమై కలెక్టర్‌ విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆమె తెలిపారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై జడ్పీ సమావేశంలో కూడా జడ్పీ చైర్మెన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. ఫిర్యాదు చేసి న వారిలో మండల వైసీపీ నేతలు గొర్ల రమేశ్‌రెడ్డి, సర్పంచ్‌ వెంకట్రమణ నాయక్‌, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising