ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల చదువులు భారం కాకూడదు

ABN, First Publish Date - 2023-03-19T23:13:19+05:30

పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా బీసీ సంక్షేమశాఖ, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు సందప్ప, జాకీర్‌హుస్సేన్‌లు తెలిపారు.

చెక్కును అందిస్తున్న బీసీ సంక్షేమ శాఖాధికారి సందప్ప, జాకీర్‌హుస్సేన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జిల్లా బీసీ, సాంఘీక సంక్షేమ శాఖాధికారులు

తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన రూ.23.62 కోట్లు జమ

రాయచోటి (కలెక్టరేట్‌), మార్చి 19: పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా బీసీ సంక్షేమశాఖ, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు సందప్ప, జాకీర్‌హుస్సేన్‌లు తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌ విధానం ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తాన్ని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి జిల్లా బీసీ సంక్షేమశాఖ, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు సందప్ప, జాకీర్‌హుస్సేన్‌లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 32,458 మంది తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తం రూ.23.62 కోట్ల మెగా చెక్కును విద్యార్థులు, వారి తల్లులకు అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ, విద్యాశాఖాధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజనీరింగ్‌ ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T23:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising