చిన్నారుల ఆట వస్తువులను ఏర్పాటు చేయాలి: కమిషనర్
ABN, First Publish Date - 2023-09-15T00:01:08+05:30
కడప నగరం రిమ్స్ సమీపంలో ఉన్న జర్నలిస్టు పార్కులో చిన్నారుల ఆట వస్తువులను త్వరితగతిన ఏర్పాటు చే యాలని కమిషనర్ ప్రవీణ్‌చంద్ అధికారులకు సూచించారు.
కడప (ఎడ్యుకేషన్), సెప్టెంబరు 14 : కడప నగరం రిమ్స్ సమీపంలో ఉన్న జర్నలిస్టు పార్కులో చిన్నారుల ఆట వస్తువులను త్వరితగతిన ఏర్పాటు చే యాలని కమిషనర్ ప్రవీణ్‌చంద్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన జర్నలిస్టుపార్కును కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. పార్కులో ప్లీనరీ, పాత్‌వేలను, పార్కులో వీధి దీపాలు, బెంచ్‌లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంత ప్రజలకు పార్కు త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు.
Updated Date - 2023-09-15T00:01:08+05:30 IST