ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిడ్జిల ఏర్పాటుకు ‘చలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం’

ABN, First Publish Date - 2023-05-31T23:35:51+05:30

కడప నగరంలోని షామీరా మసీదు వద్ద బ్రిడ్జి, లా కాలేజీ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు ‘చలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం’కు పిలుపునిస్తున్నట్లు డీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి డీఎం ఓబులేసు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఓబులేసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), మే 31 : కడప నగరంలోని షామీరా మసీదు వద్ద బ్రిడ్జి, లా కాలేజీ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నేడు ‘చలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం’కు పిలుపునిస్తున్నట్లు డీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి డీఎం ఓబులేసు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పాత బస్టాండులోని డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో నగర ఉపాధ్యక్షుడు విజయ్‌, నాయకులు ఉదయ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ షామీరియా మసీదు లా కాలేజీ బ్రిడ్జిల ఏర్పాటు కోసం 8 నెలలుగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు స్థానిక బాధితులు కలిసి ఉద్యమం చేస్తున్నా పాలకపక్షాలు కార్పొరేషన్‌ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం దారుణమన్నారు. డిప్యూటీ సీఎం నగర పర్యటనలో మాకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తే ఆరు లక్షలతో డబ్బు విడుదల చేస్తున్నాం, పనులు ప్రారంభిస్తామని చెప్పి దాదాపు ఐదు నెలలు అవుతున్నా అతీగతీ లేదన్నారు. ఈ విషయంపై చలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-05-31T23:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising