ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్‌లు రద్దు

ABN, First Publish Date - 2023-02-01T23:13:18+05:30

మండల పరిధిలోని పుత్తనవారిపల్లె మెయిన్‌ రోడ్డులో ఉన్న 70 లక్షల విలువ చేసే ప్రభుత్వ భూమిని నకిలీ అనుభవ సర్టిఫికెట్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సబ్‌ కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌ బుధవారం తహసీల్దార్‌ నరసింహకుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ను ఆదేశించిన సబ్‌ కలెక్టర్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

పుల్లంపేట, ఫిబ్రవరి 1 : మండల పరిధిలోని పుత్తనవారిపల్లె మెయిన్‌ రోడ్డులో ఉన్న 70 లక్షల విలువ చేసే ప్రభుత్వ భూమిని నకిలీ అనుభవ సర్టిఫికెట్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సబ్‌ కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌ బుధవారం తహసీల్దార్‌ నరసింహకుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. మండల పరిధిలోని పుత్తనవారిపల్లె గ్రామం కడప-చెన్నై రహదారిలో ఉంది. హైవే పక్కనే 41/2 సర్వే నెంబరులో 27 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి గతంలో సామూహిక మరుగుదొడ్లకు గ్రామస్థులు వినియోగించేవారు. అయితే ఈ భూమిపై అనుభవ సర్టిఫికెట్లు సృష్టించి కొందరు రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. దీనిపై ‘ప్రభుత్వ భూమి కబ్జా’ అనే శీర్షికన గత నెల 28వ తేదీ ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితం కావడంతో సబ్‌ కలెక్టర్‌ స్పందించారు. గ్రామ కంఠం భూములకు సంబంధించి ప్రజలను విచారించకుండా అనుభవ సర్టిఫికెట్లను ఎలా ఇస్తారని, మళ్లీ పొరపాట్లు జరిగితే క్షమించేది లేదని వీఆర్వో వెంకటసుబ్బయ్యను హెచ్చరించారు. ఈ భూమిలో జరిగిన రిజిస్ట్రేషన్‌లు అన్నీ రద్దు చేసే విధంగా సబ్‌ రిజిస్ర్టార్‌కు ఆదేశాలు జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

Updated Date - 2023-02-01T23:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising