ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవోపేతం వీరభద్రుడి బ్రహ్మోత్సవం

ABN, First Publish Date - 2023-02-21T23:17:00+05:30

భద్రకా ళీ సమేత వీరభద్రుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవా రం 7వ రోజు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

వేడుకగా నిర్వహిస్తున్న పూలంగి సేవ - నంది వాహనంపై ఊరేగుతున్న భద్రకాళీ సమేత వీరభద్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూలంగిసేవలో పులకించిన వీరభద్రుడు

ఘనంగా సూర్యప్రభ వాహనం, నంది వాహనోత్సవాలు

రాయచోటిటౌన్‌, ఫిబ్రవరి 21: భద్రకా ళీ సమేత వీరభద్రుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవా రం 7వ రోజు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ క మిటీ చైర్మెన్‌ పోలంరెడ్డి విజయమ్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ దశరథరామిరెడ్డి, ఈఓ రమణారెడ్డి ఆధ్వర్యంలో నందుల మఠం శశిభూషణ సిద్దాంతి శిష్య బృందంచే వీరశైవ ఆగమ ఆచారత్వమున ప్రమధగణ హోమం ఘ నంగా నిర్వహించారు. మంగళవారం అర్థరాత్రి స్వామి, అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు వివిధ రకాల పుష్పాలతో చేపట్టిన పూలంగిసేవతో వీరభద్రుడు పులకించాడు. సూర్యప్రభ వాహనం, నంది వాహనోత్సవాలపైన భద్రకాళీ సమేత వీరభద్రుడు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

టీటీడీ హిం దూ ధర్మ ప్రచార పరిషత్‌ చెక్కభజన భక్తులను అలరించింది. నంది వాహనోత్సవం సందర్భంగా కన్నడ రసమంజరి, టీటీడీ వారిచే ఏర్పాటు చేసిన కోలాటం, భద్రకాళీ అమ్మవారి వేషధారణ, కేరళ వాయిద్యం, చెక్కభజన, కరగాటకం, డీజే కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందించారు.

Updated Date - 2023-02-21T23:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising