ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ శాఖల ద్వారా మెరుగైన సేవలు

ABN, First Publish Date - 2023-04-19T23:30:20+05:30

ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్సలో పాల్గొన్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో జిల్లాలో పర్యటించనున్న ప్రత్యేక అధికారులు

ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి

రాయచోటి (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 19: ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నారాయణ భరతగుప్తతో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, డీఆర్‌వో సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ నవరత్నాల పథకాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో ఆయా శాఖల ద్వారా ప్రజలకు నాణ్యమైన, మెరుగైన సేవలను సంతృప్తస్థాయిలో అందించాలన్నారు. స్పందన ద్వారా అందుతున్న అర్జీలను పరిష్కరించడం ద్వారా ఎక్కువ శాతం ప్రజల సమస్యలు తొలగి అధికారులపై ఒక మంచి నమ్మకం ఏర్పడుతుందన్నారు. రెవెన్యూ, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గృహ నిర్మాణం తదితరాల్లో తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారా లేదా, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను పరిశీలించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించిందన్నారు. వీరు త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్సలో ఆర్డీవో రంగస్వామి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-19T23:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising