ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలోనే ఉత్తమమైన శిక్షణ సంస్థ

ABN, First Publish Date - 2023-03-25T23:00:44+05:30

దేశంలోనే ఉత్తమమైన శిక్షణ సంస్థగా కలికిరిలోని సీఐఏటీ-3కి ఎదుగుతుందని సీఆర్పీఎఫ్‌ దక్షిణ ప్రాంత ఐజీ (కోయంబత్తూరు) అజయ్‌ భరతన్‌ తెలిపారు.

భవనాలను ప్రారంభిస్తున్న ఐజీ అజయ్‌ భరతన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కలికిరి సీఐఏటీ-3కి ఉజ్వల భవిష్యత్తు : ఐజీ అజయ్‌ భరత్‌

నూతన భవనాలు, ఆస్పత్రి ప్రారంభం

కలికిరి, మార్చి 25: దేశంలోనే ఉత్తమమైన శిక్షణ సంస్థగా కలికిరిలోని సీఐఏటీ-3కి ఎదుగుతుందని సీఆర్పీఎఫ్‌ దక్షిణ ప్రాంత ఐజీ (కోయంబత్తూరు) అజయ్‌ భరతన్‌ తెలిపారు. కలికిరి సీఆర్పీఎఫ్‌ ప్రాంగణంలో రూ.5.50 కోట్లతో కొత్తగా నిర్మించిన క్వార్టర్‌ గార్డ్‌ భవనాలు, రూ.6 కోట్లతో నిర్మించిన ఆసుపత్రికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. చత్తీ్‌సఘడ్‌లోని జగదల్పూరు 201 బెటాలియన్‌ ఆవరణలో సీఆర్పీఎఫ్‌ 84వ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వార్షికోత్సవాలకు హాజరైన అమిత్‌షా కలికిరి సీఆర్పీఎఫ్‌ భవనాలను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కలికిరి సీఆర్పీఎఫ్‌ ఆవరణలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. జవాన్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రి, ఆయుధాలు, మందుగుండు నిల్వల కోసం క్వార్టర్‌ గార్డ్‌ భవనాలను కొత్తగా నిర్మించారు. అనంతరం ఈ భవనాల్లో కార్యక్రమాల్లో ప్రారంభించడం కోసం అజయ్‌ భరత్‌ రిబ్బన్‌ కత్తిరించి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఐజీ అజయ్‌ భరత్‌ మాట్లాడుతూ కలికిరి సీఆర్పీఎ్‌ఫకు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు. 468 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన సీఆర్పీఎ్‌ఫలో అరుదైన సీఐఏటీ-3 (ఉగ్రవాద వ్యతిరేక, తీవ్రవాద నిరోధక శిక్షణ కేంద్రం) ఉందని గుర్తు చేశారు. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఉత్తమమైన శిక్షణ సంస్థగా ఇది ఎదగగలదని అజయ్‌ భరత్‌ ఆకాంక్షించారు. వేలాది మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో సేవలు భరోసా కలిగించగలవని చెప్పారు. కలికిరి సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ సీఐఏటీ శిక్షణ కోసం మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెకండ్‌ ఇన్‌ కమాండెంట్‌ కేసీ నిర్మల్‌, కలికిరి సర్పంచు ప్రతా్‌పకుమార్‌రెడ్డి, సీపీడబ్ల్యుడీ ఈఈ శ్రీనివాసరెడ్డి, జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌ ఎస్వీ సత్యనారాయణ, సైనిక్‌ స్కూల్‌ వైద్యాధికారిణి డాక్టర్‌ హిమబిందు, డిప్యూటీ, అసిస్టెంట్‌ కమాండెంట్లు, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ అధికారులు, ట్రైనీలు, జి/240 మహిళా దళం, తిరుపతి డివిజన్‌ సీపీడబ్ల్యుడీ ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising