ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోహత్య నిషేధం అమలు చేయాలి

ABN, First Publish Date - 2023-06-26T23:34:00+05:30

గోహత్య నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఎర్రగుంట్ల విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ సంయుక్తంగా సోమవారం తహసీల్దార్‌, ఎస్‌ఐ, కమిషనర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు.

గోహత్య నిషేధ చట్టాన్ని అమలుచేయాలని ఎస్‌ఐకి వినతిపత్రాన్ని ఇస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, జూన్‌ 26: గోహత్య నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఎర్రగుంట్ల విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ సంయుక్తంగా సోమవారం తహసీల్దార్‌, ఎస్‌ఐ, కమిషనర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. హిందువులు పరమపవిత్రంగా, తల్లిగా కొలిచే దైవం ముక్కోటి దేవతలు కొలువుండే ఏకైక జీవి గోమాత అలాంటి వాటిని హత్య చేయడం దారుణమన్నారు. రాబోయే బక్రీదును పురస్కరించుకుని గోహత్య నిషేధ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని వారు అధికారులను కోరారు. అనధికారికంగా పట్టణాల్లో ఉండే అన్ని వధశాలలను గుర్తించి మూసివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వధశాలలో ఉన్న గోవులకు కూడా ప్రభుత్వ పశువైద్య అధికారి అనుమతితో కూడిన ధృవపత్రాలను ఉండాలని వారు పేర్కొన్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు చెందిన వి.చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌. ఉపేంద్రారెడ్డి, ఎస్‌.ఆంజనేయులు, జి.రామ్మోహన్‌ తదితరులున్నారు.

ప్రొద్దుటూరు టౌన్‌..: గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వీహెచ్‌పీ నాయకులు సోమవారం తహసీల్దార్‌ నజీర్‌ అహ్మద్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు సి.నాగార్జున మాట్లాడుతూ హిందూవులు పవిత్రంగా పూజించే గోవులను వధించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నందున గోవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా గోవులను వధించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నాయకులు జింకా మార్కండేయ, కాలువ చలపతి, విజయకుమార్‌, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising