ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర భవిష్యత్తుకు బాబు గ్యారంటీ

ABN, First Publish Date - 2023-05-31T23:24:04+05:30

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ అని, రాయచోటి నియోజకవర్గానికి రమేశ్‌రెడ్డి గ్యారంటీ అని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా పేర్కొన్నారు.

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియోజకవర్గ ప్రజలకు రమేశ్‌రెడ్డి గ్యారంటీ

చంద్రబాబు చిత్రపటానికి మహిళల పాలాభిషేకం : టీడీపీ

రాయచోటిటౌన్‌, మే31: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ అని, రాయచోటి నియోజకవర్గానికి రమేశ్‌రెడ్డి గ్యారంటీ అని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నాగవేణి, మహిళా నేతలు నసీబ్‌జాన్‌, లక్ష్మిదేవి, సుజాత, రుక్ష్మిణమ్మ, భార్గవి, రమణమ్మతో కలిసి పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసినందుకు అభినందన లు తెలుపుతూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500లు, తల్లి కి వందనం కింద ఇంట్లో చదువుకుంటున్న అం దరికీ రూ.15 వేలు, ప్రోత్సాహకం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలు జిల్లాలో ఎక్కడనుంచి ఎక్కడికి ప్రయాణించినా బస్సుల్లో ప్రయాణం ఉచితం. ఇద్దరి కంటే సంతానం ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనలను తొలగించడం లాంటి సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు.

పరిశ్రమలు, కంపెనీలు తేవడం ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, ఉ ద్యోగాలు వచ్చేదాకా ప్రతి నెలా రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి అందజేయడం, అన్నదాత పథకం కిం ద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికీ మంచి నీటి కుళాయి ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో బీసీలకు కూడా ప్రత్యేకంగా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన నారా చంద్రబాబుకు ప్ర తి నియోజకవర్గంలో మహిళలు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదర్‌వలి, రాజంపేట పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టేచలపతి, తెలుగు యువత కార్యదర్శి జావిద్‌, మన్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising