బాబోయ్.. కుక్కలు
ABN, First Publish Date - 2023-05-10T23:16:02+05:30
రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు. బాబోయ్.. కుక్కలంటూ అటు వైపు వెళ్లా లంటే వాహనదారులు సైతం భయపడిపోతున్నారు.
ములకలచెరువు, మే10: రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు. బాబోయ్.. కుక్కలంటూ అటు వైపు వెళ్లా లంటే వాహనదారులు సైతం భయపడిపోతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండ్యం, బి.కొత్తకోట మండలాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉం ది. ప్రధాన రహదారులు, వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రోడ్డ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. అలాగే ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలు, రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పడుకుంటున్న వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. అలాగే ద్విచక్రవాహనదారులను వెంబడిస్తున్నాయి. ఏడాది కాలంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో 280 వరకు కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. కుక్కల బారిన పడుతున్నవారిలో చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఉం టున్నారు. ములకలచెరువుకు చెందిన ఓ మహిళ పిచ్చికుక్క దాడిలో గాయపడి మృతి చెందింది. నీరు, ఆహారం వెతుకుంటూ గ్రామ సమీ పాల్లో వస్తున్న జింకలు, నెమళ్లపై కూడా కుక్కల గుంపులు దాడి చేస్తుండడంతో మృత్యువాత పడుతున్నాయి. గొర్రెలు, పశువులపై దాడి చేస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ములకలచెరువులోని నల్లగుట్టలో ఎనిమిది నెలలకు ఇంటి ముం దు నిద్రిస్తున్న నాగార్జున భార్య రమణమ్మ(45)పై పిచ్చికుక్క దాడి చేసి కరిచింది. ఈ క్రమంలో మహిళను చికిత్సల నిమిత్తం తిరుపతి రూయాకు తరలించగా అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందింది.
తాగునీరు, ఆహారం వెతుక్కుంటూ గ్రామ సమీపాల్లో వస్తున్న జింకలపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ఏదాడి కాలంలో 10 జింకలు కుక్కల బారిన పడి మృత్యువాత పడ్డాయి. ముఖ్యంగా జింక పిల్లలు కుక్కల బారిన పడి మృతి చెందుతున్నాయి. కుక్కల బారిన పడ్డ జింక పిల్లలను గ్రామస్ధులు కాపాడిన సంఘటనలు బొలెడున్నాయి.
ములకలచెరువు మండలం పెద్దపాళ్యం పంచాయతీ రామానా యునికోట గ్రామ శివార్లలోకి వచ్చిన నెమలి గ్రామంలో సంచరిస్తు ఉండేది. రెండేళ్లుగా ఇళ్ల ముందు వస్తూ గ్రామస్ధులు వేసిన ఆహారాన్ని తింటూ సమీపంలో ఉన్న చెట్లలో ఉండేది. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలోకి వచ్చిన పిచ్చికుక్క నెమలిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన పలువురు గ్రామస్ధులకు కంటకడి పెట్టించింది.
ములకలచెరువు మండలం పర్తికోట పంచాయతీ మామిడిగుం పులవారిపల్లెలో ఇటీవల మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తికి చెందిన గొర్రెల పై కుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి.
Updated Date - 2023-05-10T23:16:02+05:30 IST