ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన గుళికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2023-03-02T23:35:48+05:30

విత్తన గుళికలు, చిరుధాన్యాల పంటల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని రాయలసీమ రీజియన్‌ ప్రాజె క్టు కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, నాబార్డ్‌ డీడీఎం విజయ్‌ విహారి పేర్కొన్నారు.

సమావేశంలో మాటాడుతున్న రాయలసీమ రీజియన్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప(రూరల్‌)మార్చి 2: విత్తన గుళికలు, చిరుధాన్యాల పంటల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని రాయలసీమ రీజియన్‌ ప్రాజె క్టు కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, నాబార్డ్‌ డీడీఎం విజయ్‌ విహారి పేర్కొన్నారు. గురువారం జిల్లా పకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ కార్యాలయంలో పకృతి వ్యవసాయ సిబ్బందికి విత్తన గుళికలు, పీఎండీఎస్‌ పంటలపైన నిర్వహించిన అవగాహన సమావేశం లో వారు మాట్లాడుతూ పకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ వారి పరిధిలోని రైతులకు విత్తన గుళికల ప్రాముఖ్యతపై అవగాన కల్పించాలన్నారు. పలు చిరుధాన్యాల పంటలు సాగుతో భూమిని 365 రోజులు కప్పివుంచే పక్రియను తెలిపి ప్రతి రైతు సాగుచేసేలా చూడాలన్నారు.

పీఎండీఎస్‌ సాగుకు కావాల్సిన సీడ్‌ కిట్స్‌ని తయారుచేసుకుని రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. పకృతి వ్యవసాయం చేస్తున్న అర్హులైన ఎస్సీ రైతుల జాబితాను సిద్దంచేసి వారికి డీఆర్‌డీఏ ద్వారా పకృతి వ్యవసాయానికి తోడ్పాటు అందించే విదంగా చూడాలన్నారు. పకృతి వ్యవసాయానికి కావాల్సి న తోడ్పాడు నాబార్డ్‌ సంస్ధ ద్వారా అందించబడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రామకృష్ణరాజు, సీనియర్‌ కన్సల్టేంట్‌ సురేంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!