చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN, First Publish Date - 2023-03-15T23:28:32+05:30
చట్టాలు, హక్కులపై వినియో గదారులు అవగాహన పెంచుకుని వ్యాపారంలో జరుగు తున్న మోసాలను అరికట్టాలని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు మురళీకృష్ణ తెలిపారు.
వినియోగదారుల ఫోరం సభ్యుడు మురళీకృష్ణ
కడప(కలెక్టరేట్) మార్చి15: చట్టాలు, హక్కులపై వినియో గదారులు అవగాహన పెంచుకుని వ్యాపారంలో జరుగు తున్న మోసాలను అరికట్టాలని జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు మురళీకృష్ణ తెలిపారు. బుధవారం కలెక ్టరేట్‌లోని వీసీ హాలులో వినియోగదారుల వ్యహారాలు, ఆహార పౌరసరఫరాల శాఖ, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రపంచ విని యోగదారుల దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు పైన చట్టపర హక్కును ప్రభుత్వం కల్పించిందన్నారు. వినియో గదారులు హక్కుల పట్ల ఎప్పటి కపుడు అవగాహహన పెంచుకోవాలన్నారు.
వినియోగదారులు వ్యాపార రంగం లో ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటున్నారో కొన్ని అనుభ వాలను జోడిస్తూ వివరించారు. చాల మంది చట్టాలపై అవగాహన ఉన్నా ఆచరణలో పెట్టక పోవడంతో చాలా వరకు మోస పోతున్నారన్నారు. జిల్లా పౌరసరరాల అధికా రి సుబ్బారెడ్డి, జిల్ల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగ రాజు, వినియోగదారుల ఫోరం కన్వీనరు తిరుపాలు, పోరం ప్రతినిధి ఓబులేసు మాట్లాడారు. అవగాహన కోసం తూనికల కొలతల శాఖ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, డీలర్లు, కన్సూమర్ వాలంటరీ ఆర్గనైజర్సు, హోల్ సేల్ కిరాణా మర్చంట్, పుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిబ్బంది, పాఠశాలల విధ్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-15T23:28:32+05:30 IST