ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులపై దాడులు చేస్తే సహించం

ABN, First Publish Date - 2023-01-25T23:30:04+05:30

సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించబోమని ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడిచేసిన వైసీపీ కన్వీనర్‌ను శిక్షించాలి

ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రఘురామిరెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 25: సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించబోమని ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి హెచ్చరించారు. బుధవారం టుటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి సచివాలయ ఉద్యోగి వంశీక్రిష్ణపై దాడిచేసిన వైసీపీ కన్వీనర్‌ శ్రీనివాసులుపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐ ఇబ్రహీంను కలిసి విన్నవించారు. ఈసందర్బంగా రఘరామిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దాడులకు పాల్పడే సంస్కృతి పెరిగిపోతోందని.. వీటిని రాజకీయపార్టీల నాయకులు సమర్ధించరాదని హితవు పలికారు. వైసీపీ కన్వీనర్లు సచివాలయాల్లోకి వచ్చి ఉద్యోగుల సీట్లలో కూర్చోవడం... పెత్తనం చెలా యించడం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఈవిషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రమణయ్యను ఎన్జీవో నేతలు కలిసి... భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్జీవో అసోసియేట్‌ అఽధ్యక్షుడు సదాశివయ్య, ఉపాధ్యక్షురాలు జయంతి కుమారి, సహాయ కార్యదర్శి రామయ్య, గ్రామ సచివాలయాల ఉద్యోగుల సంఘం స్టేట్‌ ప్రధాన కార్యదర్శి హరీంద్ర, జిల్లా అధ్యక్షడు హిరామియా, ఉపాఽధ్యక్షుడు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising