ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం ఏదీ?

ABN, First Publish Date - 2023-02-06T23:47:04+05:30

మైలవరం డ్యాం ప్రాజె క్టు మునక కింద తమ గ్రామం మునిగి పోయింది. ఇందిరమ్మ హయాంలో తమ గామ్రంలోని మాదిగలందరికీ కలపి ఒక్కొక్కరికీ ఎకరా చొప్పున 200 ఎకరాల వరకు ఇచ్చారు.

కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన చౌటపల్లె దళితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం చౌటపల్లె బాధితుల ఆవేదన

స్పందనలో కలెక్టర్‌కు వినతి

కడప(కలెక్టరేట్‌) పిబ్రవరి 6: మైలవరం డ్యాం ప్రాజె క్టు మునక కింద తమ గ్రామం మునిగి పోయింది. ఇందిరమ్మ హయాంలో తమ గామ్రంలోని మాదిగలందరికీ కలపి ఒక్కొక్కరికీ ఎకరా చొప్పున 200 ఎకరాల వరకు ఇచ్చారు. వ్యవసాయమే జీవనంగా బతికే తమకు గండికోట డ్యాం వల్ల ఉన్న భూములన్నీ నీటి పాలయ్యాయి. పరిహారం ఇస్తామని అధికారులు చెప్పారే కానీ ఏళ్లు గడుస్తున్నా ఇవ్వలేదు.. తిరిగి తిరిగి అలసి పోయాం... న్యాయం చేయాలంటూ కొండాపురం మండలం చౌటపల్లె దళితులు సోమవారం కలెక్టర్‌ విజయరామరాజుకు మొర పెట్టుకున్నారు. ఎకరాకు రూ.4.50 లక్షలు ఇస్తామని చెప్పిన అధికారులు తమకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, వెంకటరమణ, లింగయ్య,శివలింగమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising