ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా మహాశివుడికి అన్నాభిషేకం..

ABN, First Publish Date - 2023-01-21T23:02:03+05:30

వాల్మీకిపురం పట్టణ పడమర పొలిమేరల్లోని ధర్మ పథంలో శనివారం మహాశివుడికి అన్నా భిషేకం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మహాశివుడికి అన్నాభిషేకం..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, జనవరి 21: వాల్మీకిపురం పట్టణ పడమర పొలిమేరల్లోని ధర్మ పథంలో శనివారం మహాశివుడికి అన్నా భిషేకం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. షిరిడీసాయి సాలిగ్రామ తిరునారాయణ థార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, ఆలయంలోని మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవలతో ప్రత్యేక పూజ లు జరిగాయి. అనంతరం ఏకవార అమావాస్య రుదాభ్రిషేకం, మహా అన్నా భిషేకం వైభవంగా నిర్వహించారు. లింగో ద్భవ మహాశివుడికి విశేష అలంకరణలతో పూజలు నిర్వహించగా భక్తులు దర్శించి తరించారు. ఈసందర్భంగా భక్తులకు అన్న, ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాలలో ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీనివాసాచార్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

గుర్రంకొండ, జనవరి 21:గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలను చేశారు. ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాల సేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామికి అభిషేకాలు చేయించడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. కార్యక్రమంలో అర్చకులు గోపాల్‌భట్టార్‌, కృష్ణప్రసాద్‌, కృష్ణరాజు, అనిల్‌, గోకుల్‌, వెంకీ, వరద, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T23:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising