ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏఎన్‌ఎంలను గ్రేడ్‌-2 కేడర్‌ ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-07-21T23:24:37+05:30

గ్రామ, వార్డు సచివా లయాల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎం లను ఆన్‌లైన్‌ యాప్‌ల బాధ్యత లనుంచి తప్పించి, పని భారం తగ్గించాలని ఏఐటీ యూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న ఏఎన్‌ఎంలు

రాయచోటి(కలెక్టరేట్‌), జూలై 21: గ్రామ, వార్డు సచివా లయాల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎం లను ఆన్‌లైన్‌ యాప్‌ల బాధ్యత లనుంచి తప్పించి, పని భారం తగ్గించాలని ఏఐటీ యూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం డీఎంహెచ్‌వోకు, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఆరోగ్య కార్యదర్శులకు ప్రత్యేక యూనిఫాం దుస్తులు ఇవ్వాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్‌ఎంలకు బదిలీలు లేనందున, పిల్లల చదువు విషయంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. గతంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద కాంట్రాక్ట్‌ పద్ధతిలో 2వ ఏఎన్‌ఎంగా 11 ఏళ్లు పనిచేసి సచివాలయ హెల్త్‌ సెక్రటరీగా వచ్చి న వాళ్లందరికీ సర్వీస్‌ కలపాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ టైంలో సేవలందించిన ఆరోగ్య కార్యదర్శులకు పదోన్నతి కల్పిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-07-21T23:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising