ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ABN, First Publish Date - 2023-06-25T23:53:12+05:30

తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో 1990-91 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివా రం అదే పాఠశాలలో సందడిగా సాగింది.

తంబళ్లపల్లెలో 1990-91 బ్యాచ పదో తరగతి విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంబళ్లపల్లె, జూన 25: తంబళ్లపల్లె ఉన్నత పాఠశాలలో 1990-91 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివా రం అదే పాఠశాలలో సందడిగా సాగింది. ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చదివిన పాఠశాలలోనే కలుసుకుని చిన్ననాటి బాల్యస్మృతులు గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు..పలకరింపుల తో సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఆనాటి గురువులు హెచ ఎం సిద్దారెడ్డి, హిరోజిరావు, నారాయణ, వెంకట్రమణలకు పాద పూజ చేసి సన్మానించారు. ఈ అపరుప క్షణాలను సెల్‌ఫోనలలో బంధించారు. అనంతరం ఆత్మీయ విందు ఆరగించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థు లు మలిగిరాఘవరెడ్డి, శంకర, కిరణ్‌, రమణారెడ్డి, శ్రీనాథరెడ్డి, వెంకట్రమ ణారెడ్డి, అమర్‌నాథ్‌, కృష్ణమూర్తినాయుడు, రఘుపతి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, గంగాధర్‌, టీచర్‌ వెంకటేష్‌, టీస్టాల్‌ శివ, సూర్యోదయ, పరమేశ్వరీ, కళావతి, తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లెలోనూ పూర్వ విద్యార్థుల కలయిక

మదనపల్లె అర్బన, జూన 25: మదనపల్లె పట్టణంలోని హోప్‌ మున్సిపల్‌ హై స్కూల్‌లో 1993-94 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదివారం గొల్లపల్లె బైపాస్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన హాల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం సం దర్భంగా తమకు విద్యను బోధించిన గురువుల ద్వారా కేక్‌కట్‌ చేసి అం దరికి పంచిపెట్టారు. అనంతరం తమకు హెడ్మాస్టర్‌గా ఉన్న శేషగిరిరావు తోపాటు ఉపాధ్యాయులు శాంతకుమారి, శ్రీనివాసులు, సుధాకర్‌, రాజకు మారిలను దుశ్శాలువలు కప్పి పూలమాల వేసి సన్మానించారు. గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. అప్పట్లో జరిగిన సన్నివేశాలను గుర్తుచేస్తూ నేమరు వేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నా మని దీనికి కారణం ఆరోజుల్లో గురువులు నేర్పిన క్రమశిక్షణే అన్ని కొనియాడారు. అంతకముందే తమకు విద్యా బుద్ధులు నేర్పి చనిపోయిన ఉపాధ్యాయులకు రెండునిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. మధ్యాహ్నం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్ర మాన్ని పూర్వ విద్యార్థులు ఫణీ, మదనమో హన, సుమంత, మోహన, ఉమా. శంకరప్రసాద్‌లు పర్యవేక్షించారు.

పీలేరులోనూ ...

పీలేరు, జూన 25: పీలేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యాసంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. ఆదివా రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విద్యార్థు లు ఇరవై ఏళ్ల అనంతరం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా ఆళింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకరికొకరు తమ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పాఠశాలలోని తమ తర గతి గదులు, వాటిలోని బెంచీలు, అక్కడ గడిపిన క్షణాలు, చేసిన అల్లరి, మాస్టర్లతో పెట్టించుకున్న చీవాట్లు గుర్తు చేసుకున్నారు. అనంతరం తమ కు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. తమకు విద్యనందించిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రతిన బూనారు. కార్యక్రమంలో డీవైఈవో ఆనందరెడ్డి, హెచఎం రమణారెడ్డి, విశ్రాంత ఎంఈవో దయానందరెడ్డి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, అనూరాధ, సరస్వ తి, మహాలక్ష్మి, రెడ్డప్పరెడ్డి, ఎర్రయ్య, నటరాజన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-25T23:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising