రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ABN, First Publish Date - 2023-03-05T22:59:49+05:30
వల్లూరు బస్టాండు నుంచి గాంధీ విగ్రహం వైపునకు వెళుతుండగా ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలుగాళ్ల సురేంద్రకుమార్ (27) మృతి చెందాడు.
బైఠాయించి ఆందోళనకు దిగిన కుటుంబీకులు
కమలాపురం రూరల్/వల్లూరు, మార్చి 5: వల్లూరు బస్టాండు నుంచి గాంధీ విగ్రహం వైపునకు వెళుతుండగా ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలుగాళ్ల సురేంద్రకుమార్ (27) మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకెళితే....
వల్లూరు యువకుడు ద్విచక్ర వాహనంపై వల్లూరు బస్టాండు నుంచి పోతుండగా బ్రాందిషాపు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాగా యువకుడు సంఘటనాస్థలం వద్దే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సురేంద్రకుమార్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విష్ణువర్ధన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కానీ వారు ఎంతకూ వినకపోవడంతో సీఐ సత్యబాబు సంఘటనాస్థలి వద్దకు వచ్చారు.
Updated Date - 2023-03-05T22:59:49+05:30 IST