అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలి
ABN, First Publish Date - 2023-06-26T23:16:45+05:30
కడప నగర పరిధిలోని ఇందిరానగర్‌లో 730, 731, 732 సర్వేనెంబర్లలో స్థలాలు ఆక్రమించుకుని పునాదులు వేసి అమ్ముతూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు.
కడప (సెవెన్‌రోడ్స్), జూన్ 26: కడప నగర పరిధిలోని ఇందిరానగర్‌లో 730, 731, 732 సర్వేనెంబర్లలో స్థలాలు ఆక్రమించుకుని పునాదులు వేసి అమ్ముతూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ సముదాయాలు ఎక్కడ నిర్మిస్తారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్ల నుంచి ఇందిరానగర్‌లో భూ అక్రమాల వి వాదం నడుస్తోందని, బ్యాచ్‌ల వారీగా స్థలాన్ని ఆక్రమించడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. ఆక్రణమదారులపై తగు చర్యలు తీసుకోకపోతే రహదారులను సైతం ఆక్రమించేస్తారన్నారు. అందుకు స్పందించిన ఆర్డీఓ అక్రమాలపై సీకేదిన్నె తహసీల్దారు నారాయణరెడ్డితో ఫోనలో మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న పనులను ఆపాలని, సంబంధిత అనుబంధ పత్రాలను పరిశీలించాలని తహసీల్దారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీకేదిన్నె మండల కార్యదర్శి ప్రసాద్, ఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి సిద్దరామయ్య, నగర కార్యదర్శి వర్గసభ్యుడు రమేష్, ఇందిరానగర్ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:16:45+05:30 IST