ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతి విద్యాసంస్థలో సైకాలజీ ఉపాధ్యాయుడిని నియమించాలి

ABN, First Publish Date - 2023-07-21T23:49:10+05:30

విద్యార్థుల కు వ్యక్తిత్వ వికాసం త రగతి బోధించేందుకు ప్రతి విద్యాసంస్థలో సై కాలజీ ఉపాధ్యాయుల ను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్‌ చేశా రు.

పీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు

కడప (ఎడ్యుకేషన్‌), జూలై 21 : విద్యార్థుల కు వ్యక్తిత్వ వికాసం త రగతి బోధించేందుకు ప్రతి విద్యాసంస్థలో సై కాలజీ ఉపాధ్యాయుల ను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్‌ చేశా రు. శుక్రవారం కడప నగరం పీఎ్‌సయూ కా ర్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కూడా పూర్తి కాలేదని, ఇంతలోనే కడప జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇ లాంటి సంఘటనలు జరగడానికి గల కారణాలను గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గడిచిన 20 రోజుల్లోనే కడప నగరంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్‌ విద్యార్థి, నెల్లూరులో మెడిసిన్‌ విద్యార్థిని వారు చదువుతున్న విద్యాసంస్థల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డార న్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం, ప్రేమ వ్యవహారం, ఇష్టం లేని చదువులు యాజమాన్య వేధింపులు లాంటి సంఘటనలు కావచ్చని అనేక మంది భావిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కా కుండా ఉండాలంటే విద్యాసంస్థల్లో సైకాలజిస్టులను నియమించి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎ్‌సయు నాయకులు గోపీ, నాగేంద్ర, నరసింహ, కేశవ, చరణ్‌, అఖిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising