ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుగ్గవంక ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలి

ABN, First Publish Date - 2023-02-06T22:34:38+05:30

బుగ్గవంక డ్యాం నుంచి చివరి పెన్నానది వరకు ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), ఫిబ్రవరి 6 : బుగ్గవంక డ్యాం నుంచి చివరి పెన్నానది వరకు ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ టూటౌన్‌ జోన్‌ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుగ్గవంక డ్యాం నుంచి చివరి వరకు ఇరువైపులా రక్షణ గోడ కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ అల్మా్‌సపేట వరకు రక్షణ కూడా నిర్మించి వదిలేశారన్నారు. అల్మా్‌సపేట నుంచి సాయిపేట, రూకువారిపల్లె, పాలెంపల్లె మీదుగా వెళ్లే బుగ్గవంక ఇరువైపులా రక్షణ గోడ నిర్మించకపోవడం బాధాకరమన్నారు. గతంలో బొగ్గవంక నీటి ప్రవాహంతో ఇళ్లు కోల్పోయాయని, భారీగా పంట నష్టం జరిగిందన్నారు. బుగ్గవంక నీటి పారుదలతో అక్కడ ఉన్న పొలాల్లో వర్షం నీరు వెళ్లి పంట పొలాలు నీళ్లలో మునిగి రైతులకు భారీ పంట నష్టం జరిగిందన్నారు. పాలెంపల్లె నుంచి వెళ్లడానికిరాకపోకలు ఆగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా అల్మా్‌సపేట నుంచి చివరి పెన్నా నది వరకు రక్షణ గోడ నిర్మించకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సీపీఐ టూటౌన్‌ జోన్‌ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, భద్రయ్య, ఫక్కీరప్ప, మేకల జయన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising