వైభవంగా వాసవీ జయంతి ఉత్సవం
ABN, First Publish Date - 2023-04-30T22:56:01+05:30
వాసవీ జయంతి సందర్భంగా ఆది వారం మండల కేంద్రంలో కన్యకాపరమేశ్వరి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి బస్టాండు సర్కిల్ నుంచి శివాలయం వరకు ఊరేగించారు.
చిన్నమండెం, ఏప్రిల్ 30: మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహి ళా మండలి సభ్యులు సుగుణమ్మ, వాసవమ్మ, అమృతమ్మ, తులసి, లక్ష్మి ఆధ్వర్యంలో ఉత్సవా లు నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, మధ్యా హ్నం అన్నదానం చేశారు. సాయంత్రం అమ్మ వారిని చాక్లెట్లతో అలంకరించి కుంకుమార్చన చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించా రు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సుండుపల్లె: వాసవీ జయంతి సందర్భంగా ఆది వారం మండల కేంద్రంలో కన్యకాపరమేశ్వరి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించి బస్టాండు సర్కిల్ నుంచి శివాలయం వరకు ఊరేగించారు. అనంతరం వైశ్యబజార్‌లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిం చి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తు లకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్ర మంలో మాటూరి సురేశ్‌శెట్టి, కూనా నరసిం హులు శెట్టి, చంద్రమౌళి శెట్టి, కృష్ణారావు, మస్తాన్‌శెట్టి, పోస్టల్ సుబ్రమణ్యం, అమరా రెడ్డి, ప్రసాద్‌తో పాటు పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరు: పట్టణంలోని కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఆదివారం మహిళలు కలశాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు శరవ ణ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అమ్మవారికి అభిషేకాలు చేశారు. హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసా దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్ బాబు, జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షు డు మేడా వెంకటసుబ్బయ్య, భుజంగే శ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ పరిటాల జగన్నాథం, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కామిశెట్టి పార్థసారథి పాల్గొన్నారు.
రామాపురం: మండలంలోని నీలకంట్రావుపేటలో కన్యకాపరమేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లెలో వెలసిన ఉదయం పూజలు చేశారు. సాయం త్రం స్థానిక బస్టాండు కూడలి నుంచి అమ్మ వారిశాల వరకు మహిళలు పుష్పాలతో ఊరేగిం పు నిర్వహించారు. ఆలయంలో పుష్పయాగం అనంతరం గ్రామోత్సవం జరిగింది. ఆర్యవైశ్య అధ్యక్షుడు యంబలూరు నరసింహస్వామి, ఉపాధ్యక్షుడు మాకం వెంకట కుమార్, తదిత రులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-30T22:56:43+05:30 IST