ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా అమ్మవారి ఊరేగింపు

ABN, First Publish Date - 2023-03-31T23:34:38+05:30

ఎర్రగుంట్లలో జరగుతున్న ఏరువాక గంగ మ్మ ఆవులపబ్బం గంగజాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. శుక్రవారం అమ్మవారి గ్రామోత్సవానికి విశేష స్పందన లభించింది.

కేరళా వాయిద్యాలతో అమ్మవారి గ్రామోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అలరించిన కేరళావాయిద్యాలు, కోలాటం

నేడు బండలాడుగు పోటీలు

ఎర్రగుంట్ల, మార్చి 31: ఎర్రగుంట్లలో జరగుతున్న ఏరువాక గంగ మ్మ ఆవులపబ్బం గంగజాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. శుక్రవారం అమ్మవారి గ్రామోత్సవానికి విశేష స్పందన లభించింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో అలంకరణలు చేశారు. 9గంటలకు పెద్దిరాజు కథను అమ్మ వారిశాలలో చెప్పారు. అనంతరం అమ్మవారి దర్శ నాన్ని కల్పించారు. సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి గ్రామోత్సవం ప్రత్యేక వాహనంలో మొదలైంది. కేరళవాయిద్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. భజన, కోలాట బృందాల నృత్యాలతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా అమ్మ వారికి నీరజనాలు పలికారు. గ్రామోత్సవం తెల్లవారుజామువరకు సాగింది. భక్తులు టెంకాయ, పూలు పండ్లు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. దారిపొడవునా మహిళలు బిందెలతో నీళ్లు పోస్తూ అమ్మవారికి స్వాగతం పలికారు. పులిహోర, గుగ్గుళ్లు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. జమ్మలమడుగు టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, ఐసీయల్‌ వీపీ సుబ్ర మణ్యం దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త ఎస్‌.సూర్యనారాయణరెడ్డి, కమిటీ సభ్యు లు సాదరంగా ఆహ్వానించి పూజలు చేయించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శనివారం ఉదయం 7గంటల నుంచి జడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో బండలాడుగు పోటీలు నిర్వహి స్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-03-31T23:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising