ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దాడిపై హత్యాయత్నం కేసు నమోదు

ABN, First Publish Date - 2023-06-21T00:16:58+05:30

మదనపల్లె పట్టణంలోని గౌతమినగర్‌కు చెందిన వెంకటరమణ, అంజలీ కుమారుడు ఆదినారాయణ మూర్తిపై దాడి కేసులో అయిదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కె.కేశప్ప తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితులంతా బాలనేరస్థులే

జువైనల్‌ హోంకు తరలింపు

మదనపల్లె, జూన 20: మదనపల్లె పట్టణంలోని గౌతమినగర్‌కు చెందిన వెంకటరమణ, అంజలీ కుమారుడు ఆదినారాయణ మూర్తిపై దాడి కేసులో అయిదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కె.కేశప్ప తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ..ఆదినారాయణమూర్తిపై అదే ప్రాంతానికి చెందిన ము గ్గురు, సీటీఎంగ్రామానికి చెందిన మరోఇద్దరు కలిసి నాలుగు రోజుల క్రితం దాడి చేశారు. స్నేహితుని జన్మదిన వేడుకలు ఉన్నట్లు బాధితుడ్ని నమ్మించి..సీటీఎం ఏరియాలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. స్థానిక ప్రశాంతనగర్‌లోని ఓ జూనియర్‌ కళాశాలలో వీరంతా ఇంటర్‌ చదువుతున్నారు. ఈక్రమంలో నిందితులు అయిదుగు రు ..నెలరోజుల క్రితం ఓ యువకునిపై దాడి చేస్తుండగా, ఆది నారాయణమూర్తి అడ్డుకుని వారించినట్లు తెలిసింది. దీన్ని మనసులో పెట్టుకున్న వారంతా..అతన్ని బర్త్‌డే పార్టీకని తీసు కెళ్లి చితకబాదారు. బాధితుడు కాళ్లవేల్లా పడినా కనికరించ కుండా విచక్షణారహితంగా కొడుతూ వీడియో తీశారు. వారి బారి నుంచి తప్పించుకుని..విషయాన్ని తల్లిదండ్రులకు చెప్ప డంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధి తుడు తల్లిదండ్రులతో కలసి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం తోపాటు తమపైనే సీఐ సత్యనారాయణ మాటలతో ఎదురుదా డికి దిగుతూ దుర్బాషలాడినట్లు బాధితులు మీడియా ముందు కొచ్చారు. దీనికి స్పందించిన ఎస్పీ..ఆదేశాల మేరకు తాలూకా పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని తిరుపతిలోని జువైన ల్‌ హోంకు తరలించారు. కళాశాలలో జరిగిన సంఘటన దాడికి కారణమైతే..బర్త్‌డే వేడుకల్లో వారి మధ్య వివాదం తలెత్తి దాడికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-06-21T00:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising