ఎన్‌సీడీ- సీడీ సర్వే 90 శాతం పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2023-05-08T23:33:08+05:30
జిల్లాలో వచ్చే వారంలోపు ఎన్‌సీడీ- సీడీ సర్వే 90 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా వైద్యాధికారులను ఆదేశించారు.
రాయచోటి (కలెక్టరేట్), మే 8: జిల్లాలో వచ్చే వారంలోపు ఎన్‌సీడీ- సీడీ సర్వే 90 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌యంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్‌ఎం, ఆశా, వైద్యాధికారులు సమన్వయంతో ఎన్‌సీడీ- సీడీ సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ సోమవారానికి 80 శాతం ప్రగతి సాధించాలని గత వారం సూచించామని, అయితే కోనంపేట, సాకిబండ, శెట్టిపల్లె, టి.సుండుపల్లె, వీరబల్లి తదితర కొన్ని పీహెచ్‌సీలు సర్వే ప్రగతిలో ఇంకా వెనుకబడి ఉన్నాయని, ఇందుకు గల కారణాలను సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారి, ఆశా, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎంలను అడిగి తెలుసుకుని వచ్చే వారంలోగా లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్ (బీయంఐ) సహా పలు రకాల సస్పెక్టెడ్ కేసులను, స్ర్కీనింగ్ పరీక్షలను ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా హెల్త్ ఐడీ జనరేట్ చేయడంలో ప్రతి వారం ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సె్‌ప్టలో రక్తపోటు, మధుమేహం, సస్పెక్టెడ్ కేసులను గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. జిల్లాను రక్తహీనత లేని జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని, అలాగే గర్భిణులు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. ఇచ్చిన లక్ష్యాలను వ ందశాతం మేర పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. సమీక్షా సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కొండయ్య, వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
‘స్పందన’కు పరిష్కారం తప్పనిసరి
‘స్పందన’లో అందిన ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. డీఆర్‌వో సత్యనారాయణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ జయరాజ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీదారులను పదే పదే తిప్పొద్దు
కడప (కలెక్టరేట్):. వివిద సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అర్జీదారులను పదే పదే కార్యాయలయాల చుట్టు తిప్పకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ విజయ రామ రాజు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది.క ఈ కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు జేసీ గణేష్ కుమార్, ట్రెనీ కలెక్టర్ రాహుల్ మీనా,డిఆర్వో గంగాధర్ గౌడ్,డ్వామా పిడి యదుభూషణ రెడ్డి, డీఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్ ,ఎస్ డిసీ నరసంహులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
Updated Date - 2023-05-08T23:33:08+05:30 IST