ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN, First Publish Date - 2023-03-05T23:04:03+05:30

టాస్క్‌ ఫోర్స్‌ డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన వివిధ దాడుల్లో 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ ఆధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రైల్వేకోడూరు(రూరల్‌) మార్చి 5: టాస్క్‌ ఫోర్స్‌ డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన వివిధ దాడుల్లో 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ ఆధికారులు తెలిపారు. వివరాల్లో కెళితే... ఆర్‌ఐ సురేశ్‌ కుమార్‌రెడ్డి, చిరంజీవు లు రెండు బృందాలుగా శనివారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా రాజంపేట సానిపాయి బేస్‌ క్యాంపు టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ ఎస్‌ఐ విశ్వనాథ్‌ తుమ్మలబయలు ప్రాంతం సరస్వతి కటువ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కొంద రు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని చూసి పారిపోయినట్లు తెలిపారు. ఆ ప్రదేశంలో 16 ఎర్రచం దనం దుంగలు, ఐదు రంపాలు, గొడ్డలి, వంటసామాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కడప సబ్‌ కంట్రోల్‌ కార్యాలయం ఆర్‌ఎస్‌ఐ నరేశ్‌ బృందం రోళ్లమడుగు పెంటబావి వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తుండగా సిద్దవటం బీట్‌ పరిఽధిలోని చెంచలచలిమి వద్ద కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని చూసి దుంగలు పడేసి పారిపోయినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో 11 ఎర్రచం దనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసులను సీఐ బాలక్రిష్ణ, ఎస్‌ఐ మోమన్‌ నాయక్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-05T23:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising