ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

30న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభం

ABN, First Publish Date - 2023-09-08T05:15:18+05:30

రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ

15 నుంచి వలంటీర్లతో ఇంటింటి సర్వే : మంత్రి రజిని

అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఈ కార్యక్రమంపై గురువారం ఏపీఐఐసీలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 నుంచి వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు వెళ్లి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి ఏఎన్‌ఎంలు, క్లస్టర్‌ హెల్త్‌ ఆఫీసర్లకు సమాచారం ఇస్తారని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఈనెల 16 నుంచి ఇంటింటికి వచ్చి బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అదే గ్రామం, వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందిస్తారని తెలిపారు. వైద్య శిబిరాల్లో 105 రకాల ఔషదాలు అందుబాటులో ఉంటాయని, వైద్య పరీక్షలన్నీ అక్కడే నిర్వహిస్తారని తెలిపారు. కాగా.. ఈ నెల 30 నుంచి రాష్ట్రంలోని ప్రతి మండలంలో రోజుకు ఒక వైద్యశిబిరం చొప్పున నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పథకంపై అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-09-08T05:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising