ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ పోలవరం కట్టలేడు

ABN, First Publish Date - 2023-08-22T03:22:09+05:30

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి కట్టలేడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

2020లో పూర్తి చేస్తానని.. ఇప్పుడు 2025కు

గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సీపీఐ రామకృష్ణ

రాజమహేంద్రవరం అర్బన్‌/పోర్టుసిటీ(కాకినాడ), ఆగస్టు 21: పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి కట్టలేడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 2020జూన్‌ కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తానని అసెంబ్లీలో చెప్పారని, మళ్లీ 2020 డిసెంబరు, 2021 జూన్‌ అంటూ గడువు మార్చారని విమర్శించారు. ఇప్పుడు 2025 అంటున్నారని, అసలు 2025లో అధికారంలో ఉంటావని గ్యారెంటీ ఏమైనా ఉందా అని జగన్‌ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గద్దె దింపి, ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్ర సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరింది. కోటిపల్లి బస్టాండు సెంటర్‌లో గోదావరి గర్జన పేరుతో నిర్వహించిన బహిరంగసభలోను, అంతకుముందు విలేకరులతోను రామకృష్ణ మాట్లాడారు. జగన్‌ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్టు పూర్తికాదని, ఒక్క కాలువ కూడా తవ్వలేడన్నారు. ఇది దొంగ ప్రభుత్వమని, ఒక దొంగ రాష్ట్రంలో దొంగ బిల్లులు సృష్టించి ఇసుకంతా అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కూడా 307 కేసు పెట్టారంటే పోలీసులకు ఏమైనా బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. సెప్టెంబరు 8న తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. కాకినాడలోని గాంధీభవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, కోస్టల్‌ కారిడార్‌, మత్స్యసంపద, ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ పరిరక్షణ తదితర అంశాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T03:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising