ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయా పోస్టు కోసం రూ.లక్ష ఇచ్చా!

ABN, First Publish Date - 2023-02-07T03:47:50+05:30

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి గ్రామంలో గంపక్క అనే దళిత మహిళ స్థానిక వైసీపీ నాయకుడిని చెడుగుడు ఆడుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీసుకున్న డబ్బులివ్వకుండా తిడతావా?

వైసీపీ నాయకుడికి చుక్కలు చూపిన దళిత మహిళ

తాడిపత్రి ఎమ్మెల్యే సభలో ఘటన

పెద్దవడుగూరు, ఫిబ్రవరి 6: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి గ్రామంలో గంపక్క అనే దళిత మహిళ స్థానిక వైసీపీ నాయకుడిని చెడుగుడు ఆడుకుంది. ‘అంగన్‌వాడీ ఆయా పోస్టు ఇప్పిస్తానంటే రూ.లక్ష ఇస్తిని. పోస్టు ఇప్పించకపోగా నన్నే బూతులు తిడతావా?’ అని తిరగబడింది. వివరాలివీ.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం వీరన్నపల్లికి చేరుకున్నారు. ఈ సమయంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు ఎమ్మెల్యే సభలో పాల్గొన్నారు. అక్కడికి వెళ్లిన గంపక్క.. సూర్యనారాయణ రెడ్డిని డబ్బు విషయమై నిలదీసింది. ‘అంగన్‌వాడీ ఆయా పోస్టు ఇప్పిస్తానంటే అప్పు చేసి లక్ష రూపాయలు ఇచ్చాను. పోస్టు ఇప్పించలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అడిగితే.. రూ.70 వేలు నా మొగుడికే ఖర్చు పెట్టానని బూతులు తిడుతున్నాడు..’ అని ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో సూర్యనారాయణ రెడ్డి నీళ్లు నమిలాడు. తాను బూతులు తిట్టలేదన్నాడు. అక్కడున్న వైసీపీ నాయకులు గంపక్కకు సర్దిచెప్పి దూరంగా తీసుకువెళ్లారు.

Updated Date - 2023-02-07T03:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising