మంత్రి రోజావి దిగజారుడు మాటలు: రామకృష్ణ
ABN, First Publish Date - 2023-01-15T03:04:18+05:30
మంత్రి రోజా దిజారుడు మాటలు మాని హుందాగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు.
అమరావతి, జనవరి 14(ఆంరఽధజ్యోతి): మంత్రి రోజా దిజారుడు మాటలు మాని హుందాగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. ప్రతిపక్షాలను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలంటూ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ కూడా ప్రతిపక్ష స్థానం నుంచే అధికారానికి వచ్చిందనే విషయాన్ని రోజా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువచ్చిన చీకటి జీవో-1 ప్రతులను రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ భోగి మంటల్లో వేసి దగ్ధం చేసిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలకు అభినందనలు తెలిపారు.
Updated Date - 2023-01-15T03:04:20+05:30 IST