ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లులు చెల్లిస్తారా.. బిల్డింగ్‌ ఎక్కి దూకమంటారా?

ABN, First Publish Date - 2023-03-02T02:38:42+05:30

రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతున్నారని కాంట్రాక్టర్లు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్ని గడువులు పెడతారు?.. అప్పులోళ్లు ఇళ్లపై దాడి చేస్తున్నారు

ఇసుక కాంట్రాక్టర్ల గగ్గోలు.. ఏపీఎండీసీ ఆఫీసు ముందు ధర్నా

అప్పులోళ్లు మా ఇళ్లపై దాడి చేస్తున్నారు

ఇసుక కాంట్రాక్టర్ల గగ్గోలు

ఏపీఎండీసీ ఆఫీసు ముందు ధర్నా

పది రోజుల్లో చెల్లిస్తామని అధికారుల హామీ

వంద కోట్ల వరకు బకాయి

అమరావతి/పెనమలూరు, మార్చి1 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతున్నారని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. బిల్లుల చెల్లింపులకు ఇంకా ఎంత కాలం, ఎన్ని గడువులు విధిస్తారని ధ్వజమెత్తారు. వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తే తమ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తమకు అప్పులిచ్చిన వాళ్లు ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేస్తున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడంలేదని వాపోయారు. బకాయిలు చెల్లించాలంటూ ఇసుక కాంట్రాక్టర్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన 30 మందికి పైగా కాంట్రాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. 2021 మే నాటి బిల్లులు తమకు చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు. ఇసుకను ప్రభుత్వ స్టాక్‌ పాయింట్లకు చేరవేయడానికి సొంత డబ్బు పెట్టుబడిగా పెట్టి పనులు చేసి రెండేళ్లయినా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. ఇప్పటికి మూడుసార్లు గడువు పెట్టినా చెల్లింపులు చేయలేదన్నారు. గత డిసెంబరులో కార్యాలయం వద్ద ధర్నా చేస్తే ఆడిట్‌ వంక చెప్పి పదిరోజుల్లో బిల్లులు వేస్తామని హామీ ఇచ్చిన అధికారులు.. ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. చివరిగా ఫిబ్రవరి 28న చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా చెల్లింపులు జరగకపోవడంతో బుధవారం ఉదయమే కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో తాడిగడపలోని ఎండీసీ ఎండీ కార్యాలయానికి చేరుకున్నారు. బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు.

‘బిల్లులు చెల్లిస్తారా? బిల్డింగ్‌ ఎక్కి దూకమంటారా..?’ ‘ఇసుక బిల్లుల కోసం తిరిగి.. మసకబారుతున్న మా బతుకులను చూసయినా బిల్లులకు మోక్షం కలిగించండి..’ ‘అప్పలు తెచ్చాం, ఇసుక కుప్పలు మోశాం.. మాటలు నమ్మిమోసపోయాం’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని శ్రీనివాసరావు అనే కాంట్రాక్టరు వాపోయారు. వారిని శాంతింపజేసేందుకు ఏపీఎండీసీ అధికారులు ప్రయత్నించారు. తమకు ఇచ్చిన మాట మేరకు బిల్లులు చెల్లించాలని, ఆ తర్వాతే ఏ విషయమైనా మాట్లాడాలని కాంట్రాక్టర్లు పట్టుబట్టారు. బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదించామని అధికారులు చెప్పారు. ఈ నెలాఖరు నాటికి బిల్లులు చెల్లిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారి హామీపై కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎంత కాలం, ఎన్ని గడువులు విధిస్తారని విరుచుకుపడ్డారు. ఇసుక తవ్వకాల కాంట్రాక్టు సంస్థ జేపీ నుంచి డబ్బులు రావాలని, ఇచ్చిన వెంటనే బిల్లులు వేస్తామని అధికారులు చెబుతున్నారని.. తమ బిల్లులతో జేపీ సంస్థకు సంబంధం ఏమిటని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఏపీఎండీసీ ఫైనాన్స్‌ జీఎం నాగేశ్వరరెడ్డి కాంట్రాక్టర్లతో మాట్లాడారు. మరో పది రోజుల్లో బిల్లులు వేస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కాంట్రాక్టర్లకు ఏపీఎండీసీ సుమారు రూ.100 కోట్ల వరకు బకాయి ఉంది.

Updated Date - 2023-03-02T02:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!