ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలి
ABN, First Publish Date - 2023-03-02T01:03:51+05:30
జిల్లాలో పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్టలో గృహనిర్మాణాలకు ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యా లను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.
కలెక్టరు వేణుగోపాల్‌రెడ్డి
గుంటూరు, మార్చి1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్టలో గృహనిర్మాణాలకు ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యా లను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మండల, పట్టణస్థాయి అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఇళ్ల పథకంలో ఉగాది నాటికి నిర్మించాల్సిన ఇళ్లను కచ్ఛితంగా పూర్తి చేయా లన్నారు. సచివాలయ ఉద్యోగులను ఇళ్ల నిర్మాణాలలో భాగాస్వామ్యం చేసి పనులను వేగవంతం చేసుకొనేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. లేఅవుట్లలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు మార్చి 10నాటికి కచ్ఛితంగా పూర్తయ్యేలా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరు చేసిన పనులను 100 శాతం శనివారం నాటికి గ్రౌండింగ్ చేయాలని, పూర్తయిన పనుల బిల్లులను వెంటనే అప్ లోడింగ్ చేయాలన్నారు. ప్రతీ గ్రామంలోని శ్మశాన వాటిక వివరాలను అందించాలని, శ్మశానవాటికలు లేని గ్రామాలకు స్థలాలను ప్రతిపాదించాలన్నారు. అవసరమైతే భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. జేసీ గణియా రాజకుమారి మాట్లాడుతూ ఎఫ్‌పీవోఎల్‌ఆర్‌లో మ్యుటే షన్ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. సాదా బైనామ దరఖాస్తులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్‌పీవో ఎల్‌ఆర్ దరఖాస్తుల పరిష్కారంలో ఆశించిన స్థాయి లో పనితీరు కనబరచని ప్రతీ మండలం నుంచి వీఆర్‌వో, సర్వేయర్‌ని ప్రతీ సోమవారం సాయంత్రం తన కార్యాలయానికి కారణాలతో స్వయంగా హాజరు కావాలన్నారు. ఒన్‌టైం కన్వర్షన్ దరఖాస్తులను ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పరిష్కరించేలా సబ్ కలెక్టరు, ఆర్‌డీవో చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖర రావు, ఎస్‌డీసీ వెంకటరామిరెడ్డి, హౌసింగ్ పీడీ సాయినాథ్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T01:03:51+05:30 IST