ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశాబ్దాల నాటి కలను సాకారం చేయండి

ABN, First Publish Date - 2023-03-26T00:06:35+05:30

గుంటూరు హైలెవల్‌ చానల్‌ పొడిగింపునకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛను నెరవేర్చాలని మాజీమంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు కోరారు.

దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న మాజీమంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు, పాల్గొన్న రైతులు, మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెదనందిపాడు, మార్చి25: గుంటూరు హైలెవల్‌ చానల్‌ పొడిగింపునకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛను నెరవేర్చాలని మాజీమంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు కోరారు. గుంటూరు చానల్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన తెలుపుతూ స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గతంలో చానల్‌ పొడిగింపునకు సర్వే నిర్వహించి టెండర్లు కూడా పిలిచి నిధులు మంజూరు చేయకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా నల్లమడ రైతు సంఘ నాయకులు కొల్లా రాజమోహనరావు నిధులు కేటాయించి పనులు ప్రారంభించుకుంటే ఉద్యమ కార్యాచరణ ను ప్రకటిస్తామని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంత తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జనసేన పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం దీక్షాశిబిరం నుంచి ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్‌ షేక్‌ మాబూసుభానికి వినతిపత్రం అందజేశారు. తొలుత దీక్షాపరులకు మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ పూలదండలు వేసి ప్రారంభించారు. మహిళా మండలి అఽధ్యక్షురాలు భ్రమరాంబ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు యార్లగడ్డ అంకమ్మచౌదరి, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు చాగంటి సత్యహర్ష, ముద్దన రాఘవయ్య, మువ్వా పెద్దన్న, బండి నాగేశ్వరరావు, మోపర్తి చెంచయ్య, రాకేష్‌, కొల్లా చిట్టెమ్మ, కొల్లా నిర్మల, చాగంటి రాముడు, కాపు అప్పారావు, కొత్త వెంకట శివ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising