సోషల్ మీడియాలో ట్రెండింగ్
ABN, First Publish Date - 2023-10-03T02:47:51+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున తెలుగుదేశం పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష సామాజిక మాధ్యాలను షేక్ చేసింది.
అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున తెలుగుదేశం పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష సామాజిక మాధ్యాలను షేక్ చేసింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా ఐటీడీపీ ట్విటర్‌లో ‘‘భువనమ్మదీక్ష’’ హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ట్వీట్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. సోమవారం రాత్రి నాటికి ఇది ట్విటర్ ఇండియా ట్రెండింగ్‌లో మూడో స్థానంలో, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో టాప్‌లో నిలిచింది.
Updated Date - 2023-10-03T02:47:51+05:30 IST