ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కాలేజీలు ఆంధ్రకేసరి వర్సిటీకే

ABN, First Publish Date - 2023-04-22T03:31:23+05:30

ఆచార్య నాగార్జున, ఆంధ్రకేసరి యూనివర్సిటీల మధ్య నెలకొన్న వివాదానికి స్వస్తి పలికేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎన్‌యూ నుంచి డీ-అఫిలియేషన్‌

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆచార్య నాగార్జున, ఆంధ్రకేసరి యూనివర్సిటీల మధ్య నెలకొన్న వివాదానికి స్వస్తి పలికేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కాలేజీలను వెంటనే ఏఎన్‌యూ నుంచి డీ-అఫిలియేషన్‌ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వివాదంపై ‘ఏఎన్‌యూ వర్సెస్‌ ఆంధ్రకేసరి’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనం ప్రచురించింది. వెంటనే స్పందించిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు దీనిపై రెండు వర్సిటీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. నిబంధనల ప్రకారం ప్రకాశం జిల్లాలోని అన్ని యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కాలేజీలు ఆంధ్రకేసరి యూనివర్సిటీకే చెందాలన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కాలేజీలకు అఫిలియేషన్లు ఇవ్వొద్దని, అడ్మిషన్లు తీసుకోవద్దని ఏఎన్‌యూకు స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-22T03:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising