ప్రతిభావంతులైన యువత భావితరాలకు స్ఫూర్తి
ABN, First Publish Date - 2023-08-22T03:12:35+05:30
శతాబ్దాల క్రితమే తక్షణశిల, నలంద వంటి విద్యాలయాల ద్వారా ప్రపంచానికి విద్యను అందించి భారత్ ‘విశ్వగురువు’ ఖ్యాతితో విరాజిల్లిందని, ఆ
వెంకయ్యనాయుడు
గుంటూరు(విద్య),ఆగస్టు 21: శతాబ్దాల క్రితమే తక్షణశిల, నలంద వంటి విద్యాలయాల ద్వారా ప్రపంచానికి విద్యను అందించి భారత్ ‘విశ్వగురువు’ ఖ్యాతితో విరాజిల్లిందని, ఆ పూర్వవైభవాన్ని తీసుకు రావాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులోని భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీలో చదివి జాతీయ స్థాయిలో 5, 10 ర్యాంకులు సాధించిన ఎ వెంకటశివరామ్, వైవీ మణీందర్‌రెడ్డిలను వెంకయ్యనాయుడు సత్కరించారు. సోమమవారం గోరంట్ల భాష్యం విద్యాసంస్థలో కార్యక్రమం నిర్వహించారు. ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహిస్తే భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాష్య విద్యాసంస్థల చైర్మన్‌భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T03:12:35+05:30 IST