రాష్ట్ర అప్పు 81,900 కోట్లు: టీడీపీ
ABN, First Publish Date - 2023-02-04T03:39:55+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల కోసం నేటి వరకు చేసిన మూలధన వ్యయం రూ.6,456 కోట్లు కాగా..
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల కోసం నేటి వరకు చేసిన మూలధన వ్యయం రూ.6,456 కోట్లు కాగా.. చేసిన అప్పు మాత్రం రూ.81,900 కోట్లని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే మొత్తం అప్పు రూ.10 లక్షల కోట్లు దాటిందని, ఇన్ని అప్పులు చేసి ఇంత తక్కువ మూలధన వ్యయం చేస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2023-02-04T03:39:57+05:30 IST