ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ స్పిల్‌వే పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2023-03-19T00:31:33+05:30

దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్‌ స్పిల్‌వే మరమ్మతు పనులను ఎట్టకేలకు ప్రాజెక్ట్‌ అధికారులు ప్రారంభించారు.

నాగార్జునసాగర్‌ స్పిల్‌వే గుంతలను కొలుస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయపురిసౌత్‌, మార్చి 18: దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్‌ స్పిల్‌వే మరమ్మతు పనులను ఎట్టకేలకు ప్రాజెక్ట్‌ అధికారులు ప్రారంభించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ స్పిల్‌వే బకెట్‌ పోర్షన్‌ అప్రోచ్‌ రోడ్డు మరమ్మతుల నిమిత్తం రూ.19.99 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. బకెట్‌ పోర్షన్‌ వద్ద నిలిచి ఉన్న నీటిని ఇప్పటికే మోటార్ల ద్వారా బయటకు పంపారు. ఆ ప్రాంతంలో ఏర్పడిన గుంతలను కొలవడం, షిప్పింగ్‌ పనులు చేపట్టారు. స్పిల్‌వే వద్దకు అధికారులు వెళ్లేందుకు నిర్మించిన అప్రోచ్‌ రోడ్డు దెబ్బతిని నీటిలో మునిగి ఉంది. దీంతో అధికారులు స్పిల్‌వే వద్దకు వెళ్లేందుకు మత్స్యకారుల పుట్టీలను వినియోగిస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం 546 అడుగులకు తక్కువగా ఉన్నప్పుడు మరమ్మతు పనులకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత నీటిమట్టం 536 అడుగులు ఉంది. పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు జూలై చివరి వరకు సమయమిచ్చారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేస్తే ఇరు(ఆంధ్ర, తెలంగాణ) రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుంది.

Updated Date - 2023-03-19T00:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising