రైతుల సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-01-18T00:08:42+05:30
గణపవరం గ్రామ పరిధిలో నూతనంగా ని ర్మిస్తున్న బైపాస్ రహదారి పనుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరా రు.
సమస్యలను వివరిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
నాదెండ్ల, జనవరి 17 : గణపవరం గ్రామ పరిధిలో నూతనంగా ని ర్మిస్తున్న బైపాస్ రహదారి పనుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరా రు. గణపవరం మాజీ సర్పంచ వలేటి హిమవంతరావుతో పాటు రైతులతో కలసి మంగళవారం కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతీయ అధికారి బెహరేను విజయవాడ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, హిమవంతరావులు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రాం తీయ అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. గణపవరం గ్రామం నుంచి అ ప్పాపురం వెళ్ళే రహదారి వద్ద బైపాస్‌కు అండర్ పాసు వంతెన నిర్మించాలని కోరారు. అదేవిధంగా బైపాస్ పనుల వల్ల సాగు నీటి కా లువలు పూడిపోయి రైతులు నష్ట పోతున్నారన్నారు. సాగర్ కాలువ లకు పైపులైనలు సక్రమంగా ఏర్పాటు చేయక పోవటంతో వర్షపు నీటితో పాటు సాగర్ నీరు ఎదురు తన్ని పొలాల్లోకి ప్రవహించటం వల్ల కంది, పత్తి రైతులు నష్టపోయారన్నారు. ఇలాంటి సమస్య పున రావృతం కాకుండా పైపులైనలు సక్రమంగా ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు. రైతులు ప్రాంతీయ అధికారి బెహ రేకు ఎంపీ సమక్షంలో వినతి పత్రం అందజేశారు. అన్ని సమస్యలు విన్న ఆయన సానుకూలంగా స్పందించినట్టు రైతులు పేర్కొన్నారు.
Updated Date - 2023-01-18T00:08:47+05:30 IST