ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూల్స్‌ లేని.. రెసిడెన్సీ ప్రోగ్రామ్‌!

ABN, First Publish Date - 2023-03-02T03:31:52+05:30

సరైన విధివిధానాలు లేవు.. నిబంధనలు సిద్ధం చేయలేదు.. బోధనాసుపత్రి ప్రిన్సిపాల్స్‌కు, డీసీహెచ్‌ఎ్‌సలకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గ్రామాలకు వైద్య విద్యార్థులు

వసతి, భోజనం, స్టైపెండ్‌ ఊసే లేదు

లబోదిబోమంటున్న పీజీ వైద్య విద్యార్థులు

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): సరైన విధివిధానాలు లేవు.. నిబంధనలు సిద్ధం చేయలేదు.. బోధనాసుపత్రి ప్రిన్సిపాల్స్‌కు, డీసీహెచ్‌ఎ్‌సలకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కానీ. ‘డిస్ట్రిక్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌’(గ్రామీణ వైద్య సేవలు)ను మాత్రం అమలు చేస్తున్నారు. మెడికల్‌ పీజీ విద్యార్థులు గ్రామీణ స్థాయిలో సేవలు అందించాలని గత ఏడాది ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీనికి రూరల్‌ సర్వీస్‌ అనకుండా ‘డిస్ట్రిక్‌ రెసిడెన్సీ ప్రొగ్రామ్‌’గా పేరు పెట్టింది. పీజీ మొదటి ఏడాది కాకుండా రెండో ఏడాదిలోకి వచ్చిన ప్రతి పీజీ విద్యార్థీ గ్రామీణ ప్రాంతాల్లో 3 నెలల పాటు విధులు నిర్వహించాలని పేర్కొంది. గత ఏడాది పీజీలో చేరిన విద్యార్థులు ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లాల్సి ఉంది. బుధవారం నుంచే పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. కానీ, పోస్టింగ్స్‌ విషయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిపై ప్రిన్సిపాల్స్‌కు, డీసీహెచ్‌ఎ్‌స (డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఫర్‌ హెల్త్‌)కు స్పష్టత లేకుండా పోయింది. వాస్తవంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో రెండో ఏడాది పీజీ చదువుతున్న విద్యార్థుల జాబితా మొత్తం డీఎంఈకి రావాలి. డీఎంఈ అధికారుల నుంచి ఏపీవీవీపీ కమిషనరేట్‌కు వెళ్లాలి. అక్కడ నుంచి వారు జిల్లాల వారీగా పోస్టింగ్స్‌ ఇస్తారు. దీనిపై అభ్యంతరాలుంటే వెంటనే కమిషనరేట్‌ పరిధిలోనే సమస్య పరిష్కరించే విధంగా ఉండాలి. కానీ, అలా లేకపోవడం ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.

ఈ ప్రశ్నలకు బదులేదీ?

జిల్లాల్లో ప్రిన్సిపాల్స్‌ విద్యార్థుల జాబితాను డీసీహెచ్‌ఎ్‌సకు పంపడం, వారు పోస్టింగ్స్‌ ఇవ్వడం వరకూ మాత్రమే అవగాహన ఉంది. ఒక విద్యార్థి తనకు ఇచ్చిన పోస్టులో చేరకపోతే ఏం చేయాలి? ఆస్పత్రిలో ఎలాంటి విధులు నిర్వహించాలి? విద్యార్థికి వసతి, ఆహారం ఎవరు కల్పిస్తారు? అసలు స్టైపెండ్‌ ఎవరిస్తారు? ఇస్తారా? ఇవ్వరా? అన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై డీఎంఈ అధికారులను అడిగినా, ఏపీవీవీపీ అధికారులను అడిగినా తమకు తెలియదనే సమాధానమే వస్తోంది.

సొంత జిల్లాపై స్పష్టత లేమి

పీజీ విద్యార్థులు చదువుతున్న కాలేజీ ఉన్న జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, విద్యార్థి సొంత జిల్లాలో కూడా గ్రామీణ సేవలు అందించవచ్చని అధికారులు మరో ఆదేశంలో పేర్కొన్నారు. అయితే, దీనిపై కూడా ఎలాంటి మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. ఇప్పటికే ప్రిన్సిపాల్స్‌ ఇచ్చిన లిస్ట్‌ ఆధారంగా కాలేజీ ఉన్న జిల్లాల్లోనే విద్యార్థులకు పోస్టింగ్‌ ఇచ్చారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఆప్షన్‌ తీసుకోలేదు. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు తమ సొంత జిల్లాల్లో పోస్టింగ్స్‌ కావాలని కోరుతున్నారు. అయితే, ఈ విషయంలో ఎవరికి దరఖాస్తు చేయాలన్న దానిపై మాత్రం డీఎంఈ కానీ ఏపీవీవీపీ కమిషనర్‌ కానీ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు విద్యార్థులకు వసతి, ట్రాన్స్‌పోర్టు, స్టైపెండ్‌ ఇవ్వడం లేదు. ఈ భారం నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే సొంత జిల్లాల్లో పోస్టింగ్స్‌ ఇస్తామని ప్రతిపాదించారనే విమర్శలు వస్తున్నాయి.

అక్కడ నిర్ణయాలు అంతే

డీఎంఈ, ఏపీవీపీలో నిర్ణయాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. అక్కడి అధికారులకు దేనిపైనా స్పష్టత ఉండడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్‌ రాగానే గుడ్డిగా దాన్ని అమలు చేయడమే తప్ప విధివిధానాలు, నిబంధనలను పట్టించుకోవడం లేదు. డిస్ట్రిక్‌ రెసిడెన్సీ ప్రొగామ్‌ విషయంలోనే కాదు గతంలో చేపట్టిన రీస్ట్రక్చరింగ్‌, వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు, బదిలీలు, సాధారణ నియామకాలు అన్నీ గందరగోళంగానే ఉన్నాయి. ఐఏఎస్‌ అధికారిని నియమిస్తే ఏపీవీవీపీ, డీఎంఈ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేస్తాయని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఇప్పుడు ఆ అధికారులే ఆ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదని, గతంకన్నా దారుణంగా మారాయన్న భావన వ్యక్తం చేస్తున్నారు. రీ స్ట్రక్చరింగ్‌తో ఏపీవీవీపీ వ్యవస్థ మొత్తం గందరగోళంగా మారింది. గత నవంబరులో కొంత మంది వైద్యుల బదిలీలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికి 4 నెలలు గడుస్తున్నా ఏపీవీవీపీ కమిషనర్‌ గానీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు ఈ బదిలీల ఫైల్‌ ఎక్కడుందో కూడా అధికారులకు తెలియని పరిస్థితి. వైద్యులు మాత్రం ఇప్పటికీ బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలతో డీఎంఈ, ఏపీవీవీపీ ఖాళీలు మొత్తం భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఫెయిల్‌ కావడంతో... దానిని పక్కన పడేశారు. ఇలా ప్రక్షాళన పేరుతో ఏదో ఒకటి చేపట్టడం దానిని పక్కన పెట్టేయడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు పీజీ విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Updated Date - 2023-03-02T03:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!