ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుడి జలవిద్యుత్‌ కేంద్రం సిబ్బందికి అభినందన

ABN, First Publish Date - 2023-03-26T00:08:08+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి జల విద్యుత్‌ కేంద్రం ద్వారా ఈ ఏడాది అత్యధికంగా 295.5 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో అధికారులు, సిబ్బందిని జలవిద్యుత్‌ కేంద్రం ఎండీ శ్రీధర్‌ అభినందించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎండీ శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయపురిసౌత్‌, మార్చి25: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి జల విద్యుత్‌ కేంద్రం ద్వారా ఈ ఏడాది అత్యధికంగా 295.5 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో అధికారులు, సిబ్బందిని జలవిద్యుత్‌ కేంద్రం ఎండీ శ్రీధర్‌ అభినందించారు. జలవిద్యుత్‌ కేంద్రం నిర్మితమై 40 ఏళ్లు పూర్తి కావడంతో అధికారులు నిర్వహించిన కార్యక్రమానికి శనివారం ఆయన హాజరై మాట్లాడారు. 2006, 2007 సంవత్సరాల్లో 283.51 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తిని అధిగమించి ఈ ఏడాది 295.5 ఎంయూ చేరడంతోపాటు ఇంకా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పనిచేసి రిటైర్‌ అయిన పలువురు సిబ్బందిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో సీఈ సుధీర్‌బాబు, ఎస్‌ఈ శ్రీనివాస, డీఈ వైఎస్‌ఆర్‌కే ప్రసాద్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. కాగా కుడి జలవిద్యుత్‌ కేంద్రంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లేబర్‌ జీతాలు పెంచాలని 327 యూనియన్‌ ఆధ్వర్యాన ఎండీ శ్రీధర్‌కు వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో యూనియన్‌ అధ్యక్షుడు సాంబశివరావు, కార్యదర్శి సూరత్‌చంద్‌, రామకృష్ణ, కిరణ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-26T00:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising