మొక్కజొన్న కొనుగోళ్లు మమ!
ABN, First Publish Date - 2023-06-07T23:52:29+05:30
వాణిజ్య పంటలు వేసి భారీ నష్టాలను కూడగట్టు కుంటున్న రైతాంగం ఈ దఫా అధికంగా ఉమ్మ డి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొక్క జొన్న వైపు మొగ్గారు. దీంతో విస్తీర్ణం పెరగడంతో దిగుబడి అంచనాలు కూడా గణనీయంగా పెరి గాయి. బాపట్ల జిల్లాలో దిగుబడి అంచనాలు 2,75,000 మెట్రిక్‌టన్నులు ఉండగా, గుంటూరు జిల్లాకు సంబంధించి 2,60,000, పల్నాడులో 1,24,000 మెట్రిక్ టన్నులుగా ఉంది
పంటచేతికొచ్చే సమ యానికి విరుచు కుపడిన అకాల వర్షాలతో అన్న దాత కంట కన్నీరు....ఇదే సమయం లో బహిరంగమార్కెట్‌లో కుప్ప కూలిన మొక్కజొన్న ధర.. ఇలాంటి పరిస్థితులలో రైతుల ఆశలన్నీ మద్దత ధర మీదే.... మార్క్‌ఫెడ్ రం గంలోకి దిగి తమను ఆదుకుంటుం దని గంపెడాశలు పెట్టుకున్నారు.. నింపాదిగా నెల రోజుల క్రితం కొనుగోళ్ల కేంద్రాలను తెరిచిన మార్క్‌ఫెడ్ దిగుబడిలో పదిశాతం లోపే సేకరించి మమ అనిపించింది. జూన్4 తో కొనుగోలు కేంద్రాలకు స్వస్తి చెప్పింది. కొనుగోళ్లను మమ అని పించిన ప్రభుత్వం ఇక డబ్బుల జమ విషయంలో మరో ప్రహసనానికి తెరతీసింది. అరకొరగా సేకరించిన మొక్కజొన్న విషయంలో.. రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే విషయంలో కూడా తాత్సారం చేస్తోంది. అకాల వర్షాలతోనే సగం కుదేలయిన రైతాంగం మద్దతు ధరకు మొక్క జొన్న కొనుగోలుచేసే విషయంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి మొత్తంగా చితికిపోయారు. చివ రకు పంట నష్టం నివేదికలను కూడా ప్రహసనంగా మార్చిన పాల కులు మొక్కజొన్న రైతులను నట్టేట ముంచారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకునే విధంగా కార్యా చరణ రూపొందించాలని రైతాం గం అభ్యర్థిస్తోంది.
బాపట్ల, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పంటలు వేసి భారీ నష్టాలను కూడగట్టు కుంటున్న రైతాంగం ఈ దఫా అధికంగా ఉమ్మ డి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొక్క జొన్న వైపు మొగ్గారు. దీంతో విస్తీర్ణం పెరగడంతో దిగుబడి అంచనాలు కూడా గణనీయంగా పెరి గాయి. బాపట్ల జిల్లాలో దిగుబడి అంచనాలు 2,75,000 మెట్రిక్‌టన్నులు ఉండగా, గుంటూరు జిల్లాకు సంబంధించి 2,60,000, పల్నాడులో 1,24,000 మెట్రిక్ టన్నులుగా ఉంది
నింపాదిగా నెల రోజుల కిత్రం
మార్క్‌ఫెడ్ రంగంలోకి..
మొక్కజొన్న పంట దిగుబడి మొదలయి దాదాపు రెండున్నర నెలలు కావొస్తోంది. కానీ మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది మాత్రం మే మొదటివారంలోనే కావడం గమనార్హం. అది కూడా అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలో సగం డ్యామేజీ జరిగాకనే. బహిరంగ మా ర్కెట్‌లో రేటు ఎక్కువ ఉండడం వల్లనే కొనుగోలు కేంద్రాలను తెరవడం ఆలస్య మైందని ప్రభుత్వం చెప్పే మాటలు రైతుల పట్ల నిర్లక్ష్యానికి అద్దం పడు తున్నాయి. బయటి మార్కెట్‌లో ధర ఎక్కువ ఉన్నప్పటికీ ఆ రేటును అలా స్థిరంగా ఉంచే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలు తెరవడం అనేది గతం నుంచీ వస్తూనే ఉంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా దిగుబడు లో మెజారిటీ భాగం దళారుల వద్దకు చేరాక మార్క్‌ఫెడ్ సేకరణ కేంద్రాలు తెరవడాన్ని అన్నదాతలు తీవ్రంగా తప్పుబట్టారు.
నిబంధనల సడలింపు ఊసేలేదు..
నిర్దేశించుకున్న అరకొర లక్ష్యాన్ని కూడా మార్క్‌ఫెడ్ చేరుకోకపోవడం పట్ల నిబంధనల ఉచ్చు కూడా కారణంగా కనబడుతోంది. అకాల వర్షాల ధాటికి చాలావరకు మొక్కజొన్నకు డ్యా మేజీ జరిగింది. ఈ క్రమంలో మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసే విషయంలో నిబంధనల విషయంలో ఉదారంగా వ్యవహరి స్తామని పాలకులు ఘనంగా ప్రకటించారు. కానీ ఆచరణలో ఆ సంగతే మరిచిపోయారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చి కూడా నిబంధనల సంకెళ్ల వల్ల మద్దతు ధర అందుకోని అన్నదాతలు కూడా గణనీయంగా ఉన్నారు.
అకాల వర్షాలతో కన్నీరు...
మార్చి నెలతో పాటు ఏప్రిల్ చివరి వారంలో కురిసిన అకాల వర్షాల వల్ల ఎక్కువగా నష్టపో యింది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులే. అప్పటి వరకు బహిరంగ మార్కెట్‌లో ఉన్న మెరుగైన ధర కాస్తా ఒక్క సారిగా కుప్పకూలింది. దీనికి తోడు అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట తడవడం, నేల వాలిన పైరుతో ఆశించిన దిగుబడులు రా లేదు. చేతికొచ్చిన ఉత్పత్తి కూడా చాలావరకు డ్యామేజీ జరిగిం ది. ఈ నేపథ్యం లో పంట కొనే నాధుడు లేక, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరవక అన్నదాతల అవస్థలు అన్నీఇన్నీ కాకుండా పోయాయి. చేసేది లేక బహిరంగ మార్కెట్‌లో దళారులు చెప్పిందే వేదంగా పంటను అమ్ముకుని రైతులు నిలువునా నష్టపోయారు. దిగుబడిలో దాదాపు 70 శాతం దళారుల పాలయ్యాక మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 25,000 మెట్రిక్ టన్నులలోపే మొక్కజొన్నలను సేకరించి కొను గోళ్లను మమ అనిపించి రైతులను వంచించారు.
నష్ట నివేదికల్లోనూ అదే నిర్లక్ష్యం..
అడుగడుగునా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిం చిన ప్రభుత్వం చివరికి అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట నష్ట నివేదికల్లోనూ చిన్న చూపే చూసింది. ప్రాథమిక నివేదికలకు తుది నివేదికలకు పొంతనే లేకుండా ప్రభుత్వం తుది జాబితాను రూపొందించింది. బాపట్ల జిల్లాలో 9,473 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం ప్రాథమిక నివేదిక తయారుచేసింది. తుది అంచనాలకు వచ్చేసరికి అది కాస్తా 5,428 ఎకరాలకు తెగ్గేసుకుపోయిం ది. దాదాపు ఇదే పరిస్థితి గుంటూరు, పల్నాడు జిల్లాలో కూడా నెలకొంది. క్షేత్రస్థాయిలో జరి గిన నష్టానికి తుది నివేదికలకు పొంతనే లేక పోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఉదారంగా సాయం చేసి తమను ఆదుకోవాలని మొక్క జొన్న రైతులు వేడు కుంటున్నారు.
లక్ష్యం ఇలా.. కొనుగోళ్లు తీసికట్టు..
ఆలస్యంగా రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్ దిగుబడుల్లో పది శాతంలోపే కొనుగోలుకేంద్రాల ద్వారా సేకరణ లక్ష్యాన్ని విధించుకుంది. మే మొదటివారంలో ఆర్‌బీకేలకు అను సంధానంగా కొనుగోలు కేంద్రాలను తెరవడం ఈ నెల 4తో వాటిని మూ సేసి మమ అనిపించారు. బాపట్ల జిల్లాలో 10,775 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లను జరపాలని లక్ష్యంగా పెట్టుకోగా గడువు ముగిసే నాటికి 8,300 టన్నులకే పరిమిత మైం ది. అదే విధంగా గుంటూరు జిల్లాలో 7,650 మెట్రిక్ టన్నులు, పల్నాడు జిల్లాలో 4,800 మెట్రిక్‌టన్నుల సేకర ణతోనే సరిపుచ్చి మొక్కుబడి తంతు ను ముగించారు. వాస్తవ దిగుబడికి నిర్దేశించుకున్న లక్ష్యానికి హస్తిమశ కాంతరం తేడా ఉంటే ఆ కాస్త లక్ష్యాన్ని కూడా చేరుకోలేక మార్క్‌ఫెడ్ చతికల పడింది. ఇదిలా ఉండగా ఈ అరకొర కొనుగోళ్లకు సంబంధించి కూడా అన్న దాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయ డానికి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
Updated Date - 2023-06-07T23:52:29+05:30 IST