శునకానికి గోమాత పాలు
ABN, First Publish Date - 2023-02-21T00:08:25+05:30
తన బిడ్డతో పాటు శునకానికి కూడా పాలు ఇస్తున్న గోమాతను చూసి పలువురు అచ్చెరువొందుతున్నారు.
లేగదూడతో పాటు శునకానికి పాలు ఇస్తున్న గోమాత
తెనాలి అర్బన్, ఫిబ్రవరి 20: తన బిడ్డతో పాటు శునకానికి కూడా పాలు ఇస్తున్న గోమాతను చూసి పలువురు అచ్చెరువొందుతున్నారు. గంగానమ్మపేటలో ఓ ఆవు తన లేగదూడకు పాలు ఇస్తున్న సమయంలో ఓ కుక్క కూడా వచ్చి పాలు తాగింది. రెండు మూడు రోజులుగా ఇలా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. జాతి బేధం మరిచి మూగజీవాలు మాతృప్రేమను పంచడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Updated Date - 2023-02-21T00:08:26+05:30 IST