ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖ రాజధాని..

ABN, First Publish Date - 2023-02-02T01:22:28+05:30

‘సొంత బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం తాడేపల్లి ప్యాలెస్‌ను తాకింది. ఆవిషయాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ రాజధాని పర్య టనలో విశాఖనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని, షిప్ట్‌ అవుతున్నామంటూ పలుకుతున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు.

టీడీపీ నేతలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌

అచ్చంపేట, ఫిబ్రవరి 1 : ‘సొంత బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం తాడేపల్లి ప్యాలెస్‌ను తాకింది. ఆవిషయాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ రాజధాని పర్య టనలో విశాఖనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని, షిప్ట్‌ అవుతున్నామంటూ పలుకుతున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. బుధవారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో అచ్చంపేట మండల టీడీపీ నాయకులతో కొమ్మాలపాటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి మాట్లాడుతూ సీబీఐ అధికారులతో అవినాష్‌రెడ్డి చెప్పిన ఇద్దరు వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు తాడేపల్లి ప్యాసెల్‌ చుట్టూ తిరుగుతుండటంతో హుటాహుటీన ఢిల్లీకి వెళ్ళి విశాఖ రాజధాని అంటూ తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. హైకోర్టులో అమరా వతే రాజధాని అని హైకోర్టు తీర్పు నిచ్చినా, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం అక్కడ విచారణ కొనసాగు తుండటం అందరికి తెలిసిందేనన్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు విచారణలో ఉన్న రాజధాని అంశాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకో కుండా కోర్టులను సైతం లెక్క చేయకుండా విశాఖ రాజధాని అని మళ్లీ మాట్లాడటం ఏ విధంగా సమంజసమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి న్యాయస్థానాలపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయాన్ని ఆయన మాటలే స్పష్టంచేస్తున్నాయన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదిలించ లేరని అన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిగం ఆశీర్వాదం, నల్లమేకల వెంకటేశ్వర్లు, పాటిబండ్ల బాపిరాజు, పులి తిరుపతి స్వామి, పొన్నెకంటి శివయ్య, ఎస్కే కాసుల, మొక్కపాటి గిరిబాబు, యడ్లపల్లి బుచ్చిబాబు, చిమటా శ్రీనివాసరావు, పొన్నెకంటి రవి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising